• Tuphanu Ratri
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తుఫాను రాత్రి

    Tuphanu Ratri

    Pages: 151
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమ్మ, నాన్నల తోడు లేని సమయంలో తుఫాను రేపిన అలజడుల్లో పూర్తిగా తడిసి గడ్డకట్టుకుపోయిన చిన్నతనపు చిరు జ్ఞాపకాల అనుభవాలను అక్షరాల వెల్లువగా కూర్చిన వాస్తవిక భయోత్పాతం ఈ 'తుఫాను రాత్రి'.

ఆత్మకూరు రామకృష్ణగారి మనసులో ఎప్పటికీ చెరిగిపోని, చెదిరిపోని అనుభవాలను, అనుభూతులను చిన్న చిన్న అంశాలతో సహా ఉత్ప్రేక్షించి, తదనుభవాలను, అనుభూతులను పాఠకుడి మనసుపై కూడా అదే విధంగా ముద్రింపబడేటట్లు ఒక ప్రవాహోద్వేగ శైలిలో వివరించారు.

'తుఫాను'ను ఒక విశాలమైన కాన్వాసుపై, తన మౌలిక కళైన చిత్రరచనను ఈ దీర్ఘకవితలో అక్షరబద్ధం చేసి చూపారు. తుఫాను పట్ల పిల్లల, పెద్దల, వృద్ధుల, ప్రేమికుల, రైతుల మనఃస్పందనలే కాక, పక్షులు, చెట్లు, జంతువులతో పాటు చరాచర వస్తుసహితమైన సకల ప్రాకృతిక సంస్పందనలన్నీ చాల సూక్ష్మంగా పరిశీలిస్తూ, హృద్యంగా వివరించి వర్ణించారు. ప్రాకృతిక మానవీకరణకు పట్టం కట్టారు.

స్థూలంగా ఇదీ 'తుఫాను రాత్రి' దీర్ఘకవిత. ఏకధాటిగా కురిసే వాన చినుకుల వాహనాల మీదెక్కించి పాఠకుల మనసులను వరద సుళ్ళు తిప్పారు.

- మాకినీడి సూర్యభాస్కర్

Preview download free pdf of this Telugu book is available at Tuphanu Ratri