-
-
తుపాను
Tupanu
Author: William Shakespeare
Pages: 102Language: Telugu
ప్రజాశక్తి బుక్‌హౌస్ (నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్) వారు ప్రచురించిన షేక్స్పియర్ నాటకాల సిరీస్‌లోని నాటకం -"తుపాను". శ్రీ లక్ష్మీకాంత మోహన్ దీనిని తెలుగులోకి అనువదించారు.
* * *
షేక్స్పియర్ వెయ్యికి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసురోమంటూ కృత్రిమంగా వుండక, చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్థం అవుతుంది. ఇంతవరకూ కూడా మరే రచయిత చూడని కోణాల నుండి మానవ మనస్తత్వాన్ని చూపించాడు.
- లక్ష్మీకాంత మోహన్
* * *
ఉన్నత స్థాయి మేధావిగా పేరొందిన లక్ష్మీకాంత మోహన్ మా వూరివాడు అయివుండడమే గాదు, ఆదిలో మా వాతావరణంలో ఆయన ప్రభావితుడు కావడం కూడా నాకు గర్వకారణంగా ఉంది. చిన్నవీ, పెద్దవీ 60 పుస్తకాల్లో ఈయన రచనలు ప్రచురితమైనాయి. దాదాపు 15 షేక్స్పియర్ నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
- మోటూరు హనుమంతరావు
* * *
షేక్స్పియర్ విషయంలో ఈయనకు ఉన్న పాండిత్యం, షేక్స్పియర్ గ్రంథాలలోని అందాలను ప్రదర్శించడంలో ఈయన చూపే ప్రతిభ అద్వితీయమైనది. గ్రంథకర్త బావాన్ని ఏ విధంగానూ చెడనీయకుండా, తెలుగుదనాన్ని ప్రదర్శించడంలో ఈ అనువాదకర్త అప్రతిహతమైన శక్తిని చూపాడు.
- త్రిపురనేని గోపీచంద్
