• Tummeti Raghottama Reddy Kathalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు

    Tummeti Raghottama Reddy Kathalu

    Pages: 418
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కథలు నేను యింతకుముందు చాలావరకు చదివాను. ఇరవై-యిరవై అయిదేళ్ళ కిందట తెలంగాణలో ఏం జరిగిందో నాకు చాలావరకు తెలుసు. అనేక ఉద్యమాలు - రైతాంగ ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమాలు, సారా వ్యతిరేక పోరాటాలు జరిగాయి. వాటి గురించి ఆ రోజు తెలిసినవాటి కంటే కూడా ఈ కథలు యిప్పుడు చదువుతుంటే యింకా అనేక కొత్త విషయాలు తెలిశాయి. బహుశా సాహిత్యం చేసే పని యిదేనని విమర్శకులు అంటూంటారు. నాకూ అలాంటి అనుభవమే కలిగింది.

రఘోత్తమరెడ్డి తాను కథ రాద్దామనుకున్న దాన్ని చాలా లోతుగా చూస్తాడని, మానవ సంబంధాల్లో, విలువల్లో ఉద్యమాలు తీసుకువస్తున్న ఘర్షణని సంక్లిష్టంగా, ప్రతిభావంతంగా చిత్రిస్తాడని ఈ కథలు చదివితే తెలుస్తుంది. రాజకీయ ఆందోళనలు, ఉద్యమాలు సమాజంపై తీసుకువచ్చే వత్తిడి, ప్రభావం వల్ల మనుషుల చైతన్యంలో ఏ మార్పు వస్తుంది? అసలు ఆ చైతన్యంలో ఏ మార్పు సాధించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమాలు జరుగుతాయి? అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ కథలు సమాధానంగా నిలబడతాయి. ఉద్యమాల చరిత్రని అర్థం చేసుకోడానికి కూడా ఈ కథలు ఉపయోగపడతాయి.

- ప్రొ. జి. హరగోపాల్
రాజనీతి ఆచార్యులు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్

Preview download free pdf of this Telugu book is available at Tummeti Raghottama Reddy Kathalu