-
-
తుమ్మపూడి - సంజీవ దేవ్ స్వీయచరిత్ర
Tummapudi Sanjeevdev Sweeya Charitra
Author: Suryadevara Sanjeev Dev
Publisher: Rajachandra Foundation
Pages: 706Language: Telugu
విచిత్రోక్తుల వెన్నల రాయడు
కళాచర్చల కర్పూర వసంత రాయడు
గిరాం చిరంటి వరాల పాపడు
రాశీభూత స్వయంకృషి
రస ఋషి సంజీవ దేవ్!
ఆయన జీవితమే ఒక సౌందర్యోపనిషత్.
సంస్కృతి ఆయన మతం.
విశ్వమానవ సౌదర్యం ఆయన ఆదర్శం.
సౌజన్యం ఆయన అనన్య పద్ధతి (Mannerism).
ప్రపంచమే ఆయనకు పాఠశాల; తుమ్మపూడి కుగ్రామమే ఉద్యద్విద్యోద్ఘనం! అందుకే ఈ గ్రంథానికి ఆ శీర్షిక.
అతివాద మితవాదాలను ధిక్కరించిన హితవాదిగా, జీవనకళాబోధనా ప్రసంగాల దేవగాంధారి రాగాలాపానలలో, అసంఖ్యాక సభలలో జిజ్ఞాసువులను జ్ఞాననంద జలధిలో ఓలలాడించిన తేనె కిన్నెర, అగరు తెమ్మెర ఆయనే. తార్కిక తాత్విక వ్యాఖ్యలతో, విమర్శలతో, అనితర సాధ్య మనోహర గద్యశైలిలో ఆయన చేసిన రచనలు నవ్యాంధ్ర సరస్వతికి దాపుడు చీరలు.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాభిజ్ఞునిగా, ఆంధ్రాంగ్ల భాషా రచయితగా - కవిగా, ప్రకృతి చిత్రకారునిగా, మనస్తత్వ శాస్త్రవేత్తగా, ప్రాచ్ర్య పాశ్చాత్య దర్శనశాస్త్ర విదునిగా, వైజ్ఞానికుని, లలితకళా విమర్శకునిగా, హిమాలయ పర్యటకునిగా, లేఖాస్నేహశిల్పిగా, వక్తగా, సకలజన సన్మిత్రునిగా, సర్వసమతావాదిగా, పరనారీ సహోదరునిగా - సహస్ర పూర్ణిమాచంద్ర దర్శనం నెరపిన మహా మానవతా ప్రతినిధి ఆయన.
మారిపోయే వెలుగునీడల మర్మశిల్పంగా, మనసు కరిగే ఆనంద విషాదాల మధుర లాస్యంగా ఆ ధన్యజీవి తన అపూర్వానుభవాలు, అగాధాలోచనలే ఓతప్రోతాలుగా నిర్మించి, తెలుగుజాతికి సమర్పించిన ఈ అపురూప స్వీయచరిత్ర ఒక అనర్ఘ కాశ్మీర రత్న కంబళం! సంజీవ దివ్య మహేంద్రజాలం!!
- ఎస్. ఆర్. తపస్వి
