-
-
త్రిపుర ఓ జ్ఞాపకం
Tripura O Gnaapakam
Publisher: Sahiti Mitrulu
Pages: 400Language: Telugu
“చనిపోయేటప్పుడు ఈ మనుష్యుల భుజాల మీంచే పోతావు నీ అంతిమ విశ్రాంతి కోసం
నీ చితి చుట్టూ చేరిన మనుష్యుల కళ్ళ నీళ్ళ లోనే మెదులుతూ వుంటావ్
ఆ మనుషుల జ్ఞాపకాల కళ్ళ నీళ్ళ లోనే కదులుతూ వుంటావ్"
~ త్రిపుర
“త్రిపుర అంటే కధలు, కవితలు, ఉత్తరాలు; త్రిపుర అంటే ప్రేమ, కోపం, మోహం
త్రిపుర అంటే అసామాన్య సామాన్యం, త్రిపుర అంటే విలక్షణత్వం
త్రిపుర అంటే వెన్నతత్వం; త్రిపుర అంటే వెన్నెలత్వం"
~ అత్తలూరి నరసింహరావు
* * *
“జాలి, ప్రేమ, ఆర్ద్రత నిండిన మూర్తి త్రిపుర గారు"
~ భమిడిపాటి జగన్నాథ రావు
* * *
"ఒక బుచ్చిబాబో, ఒక తిలక్కో, ఒక మోహన్ ప్రసాదో, ఒక అజంతానో, ఒక నగ్నమునో చెప్పే రకం కవిత్వం త్రిపుర గారి కధలన్నిట్లొనూ కనబడే జీవనాడి"
~ భరాగో
* * *
“ ఆధునిక తెలుగు కవిత్వంలో ఇస్మాయిల్ లాగా, త్రిపుర కూడా ఒక 'కల్ట్ ఫిగర్'.
తెలుగు సాహిత్యానికి నిజమైన ఆధునికతను పరిచయం చేసిన
శ్రీశ్రీ, పఠాభి, బైరాగి, అజంతా, మోహన్ ప్రసాద్‌ల కోవకు చెందిన రచయిత"
~ వాడ్రేవు చినవీరభద్రుడు
* * *
“శైలీ-శిల్పం కథా కథన రీత్యా త్రిపుర ఒక అరుదైన రచయిత.”
~ నిఖిలేశ్వర్
* * *
“తన వెదుకులాటలో జిడ్డు కృష్ణమూర్తి నుంచి, మార్క్సిజం నుంచి జెన్ బుద్దిజం దాకా అవలోకితేశ్వర ధ్యానం తో దర్శించ ప్రయత్నించారు త్రిపుర"
~ రామతీర్ధ
* * *
“మన అలజడి, అశాంతి, ఆవేదన, ఆకాంక్షల బావిలోంచి బయటికి లాగి కొండ అంచున నిలబెట్టి దిగువ అగాధాన్నీ, పైన అనంతాన్నీ చూపించి మన వస్తు ప్రపంచాన్ని ముక్కలు చేసి వదులుతాడు త్రిపుర"
~ తల్లావజ్జుల పతంజలి శాస్త్రి
* * *
“కొద్దిపాటి సన్నిహితులు త్రిపురలోని అపురూపమైన ప్రజ్ఞను, తత్వాన్ని, కరుణను, హ్యూమర్ ను, నైసర్గికమైన వినయాన్ని చూడగలుగుతున్నారు. త్రిపుర కధలు ఆయన ప్రజ్ఞ లోతులకి చిన్నపాటి మచ్చుతునకల్లా ఉండి త్రిపురగారే ఉండగా అవెందుకులే అనిపిస్తాయి"
~ కనకప్రసాద్
* * *
"కీర్తికి దగ్గర కావడమంటే శాంతికి దూరం కావడమని తెలిసిన ఈ ఏకాంతుడు తన 84 ఏళ్ల క్షణ క్షణ ప్రయాణంలో వొదిలిన 15 పాద ముద్రలు... త్రిపుర కధలు"
~ రమణజీవి
* * *
గమనిక: "త్రిపుర - ఓ జ్ఞాపకం" ఈబుక్ సైజు13 mb
