-
-
త్రిభాషా మిని నిఘంటువు
Tribasha Mini Nighantuvu
Author: Dr. B. Lakshmaiah Setty
Publisher: Victory Publishers
Pages: 304Language: Telugu
త్రిభాషా మిని నిఘంటువు (హిందీ- ఇంగ్లీషు - తెలుగు)
ఆంధ్రప్రదేశ్లోని ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో హిందీ బోధనలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ పుస్తకం రూపొందించడమైనది. అతి తక్కువ పాఠశాలలలో హిందీని హిందీలాగా బోధిస్తున్నారు. ఎక్కువ బడులలో హిందీని అనువాద పద్ధతులలో నేర్పిస్తున్నారు. ఈ పద్ధతిలోని ప్రధానమైన లోపమేమిటంటే - ఉపాధ్యాయులలోనూ, విద్యార్థుల్లోనూ - ఇంగ్లీషు లేదా తెలుగు (ప్రాంతీయ భాష) భాషలలో పరిపూర్ణత లోపించడం. అటువంటి వారికి తోడ్పడడం కోసమే ఈ నిఘంటువు రూపొందించబడింది.
హైస్కూలు స్థాయి హిందీ పాఠ్యపుస్తకాలలో ఉండే పదకోశాన్ని సేకరించి, ఈ పుస్తకంలో వివరించడమైనది. వాటికి తత్సమానమైన ఆంగ్ల, తెలుగు పదాలను సరళంగా సూచించడమైనది. కఠిన పదాలకు తగిన వివరణనిచ్చాము. కొన్ని హిందీ పదాలను స్త్రీ, పుంలింగాలలో వాడతారు. వాటి గురించి కూడా వివరించడమైనది. అంతే కాకుండా నిత్యజీవితంలో ఉపయోగించే హిందీ పదాలకు అర్థాలు అనుబంధంలో ఈయడమైనది.
ఈ నిఘంటువు విద్యార్థులకు, అధ్యాపకులకు ఉపకరించగలని ఆశిస్తున్నాము.
- ప్రచురణకర్తలు
