-
-
టచ్ మి నాట్
Touch Me Not
Author: Madhubabu
Publisher: Madhu Priya Publications
Pages: 264Language: Telugu
ఆల్బర్ట్ ఫెరెడో కుమారుడికోసం భారతదేశంనుంచి వచ్చింది తాను ఒక్కడే... తనతోపాటు మరో వ్యక్తి కూడా నగరంలోకి అడుగుపెట్టినట్లు, ఇన్స్పెక్టర్ వాంగ్ని, అతను చావకొట్టి చెవులు మూసినట్లూ చెప్పుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళందరూ చూస్తుండగానే జాంగ్ సార్ అనబడే ఒక పెద్దమనిషి భవంతిలోకి జొరబడి, మళ్ళీ బయటికి పారిపోయిన తెంపరిట ఆ రెండో వ్యక్తి.
ఎవరై వుంటాడతను? కొంపతీసి శ్యామ్సుందర్ అయివుండడు కదా! తనతోపాటు శ్యామ్సుందర్ కూడా ఆ దేశంలోకి వచ్చాడేమో అన్న మాట మనసులో మెదిలేసరికి మృష్టాన్న భోజనం చేసినట్లు ఎంతో తృప్తి కలిగింది వాత్సవకి.
డైనమిక్ పర్సనాలిటీ శ్యామ్సుందర్ది. ఆరు నూరయినా సరే తాను తలుచుకున్న పనిని సాధించేదాకా నిద్రపోని మొండి మనస్తత్వం.
అతను ఆ దేశంలోకి వచ్చినమాట వాస్తవం అవ్వాలని ఎంతగానో కోరుకుంటూ తాను చిక్కుపడి వున్న విచిత్ర పరిస్థితిని గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు వాత్సవ మరోసారి.
సూపరిన్టెండెంట్ మియాచీ, ఇన్స్పెక్టర్ వాంగ్, ఇప్పుడు బందిపోటు దొంగల నాయకుడు మాదిరి కనిపిస్తున్న ఈ సర్దార్లతో పాటు జాంగ్ సార్ అనబడే కొత్త కారెక్టర్ గురించి తనకు తెలిసింది.
Please Provide eBook Feature