-
-
టాప్ టెన్
Top Ten
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Pages: 347Language: Telugu
"నా పేరు దేవీదాసు. మీ అందరినీ కిడ్నాప్ చేయించి తీసుకొచ్చింది నేనే" తనను తాను పరిచయం చేసుకున్నాడు దేవీదాసు.
"మంచిగాని, చెడుగాని ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించే మనం ఆ పని చేస్తాం. మా నుంచి నువ్వేం ఆశిస్తున్నావో చెప్పు నాయనా?" ఎంతో శాంతగంభీర స్వరంతో అడిగాడాయన.
దేవీదాసు ఆశ్చర్యపోకుండా వుండలేకపోయాడు.
సాధారణంగా కిడ్నాప్‌కు గురైనవాళ్ళు తాము ఏమైపోతారో, ఏం జరుగుతుందోననే భయం, ఆందోళన చెందుతారు. విచారంలో మునిగిపోతారు. కాని ఆ పదిమంది ముఖాల్లో విచారం అనేది ఏ కోశానా కన్పించటం లేదు. పైగా ఏమీ జరగనట్టే నిర్వికారంగా, నిర్విచారంగా, చాలా ప్లజంట్‌గా కన్పిస్తున్నారు. ఒక విధమైన దివ్యతేజస్సు ఆ అందరి ముఖాల్లోనూ కొట్టొచ్చినట్టు
కన్పిస్తోంది.
"చెప్పు నాయనా! నీవు మా నుంచి ఏమి ఆశిస్తున్నావ్?"
స్వామీజీ ప్రశ్నతో -
ఆలోచనల నుంచి బయటపడ్డాడు దేవీదాసు.
"నాకు ప్రపంచాధిపత్యం కావాలి" చెప్పాడు.
"దానికి శివకటాక్షం అవసరం."
"అపార ధనరాశులు నా వశం కావాలి."
"దానికి లక్ష్మీ కటాక్షం అవసరం."
"నవగ్రహ యాగం తలపెట్టాను. మీరు దగ్గరుండి యాగం జరిపించాలి."
"యాగం జరిపించటానికి మాకు అభ్యంతరంలేదు. కాని యాగఫలం నీకు దక్కుతుందో లేదో అది సందేహమే."
