• Tondam Bokkena
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తొండం బొక్కెన

    Tondam Bokkena

    Publisher: Jamboo Sahithi

    Pages: 180
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ రకంగానైనా దళిత కథా వార్షిక రావడం సంతోషం. ప్రతి యేటా వొచ్చే మంచి కథలను ఎంపిక చేసి, వాటిని వొకచోట సంకలనం చేసే పనికి పూనుకున్నందుకు గుడిపెల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య, డా. సిద్దెంకి యాదగిరిలకు అభినందనలు. ఇది తెలుగు కథా ఇతిహాసంలో వొక మైలు రాయిగా నిలిచిపోతుంది. కథా వార్షికల రాజకీయాలు తెలియనివి కావు. ముఖ్యంగా తెలుగు కథా వార్షికలు కొన్ని ప్రాంతాల, కొన్ని వర్గాల గొప్పతనాన్ని ఎత్తిపట్టడానికి, సాహిత్య రంగం మీద వాళ్ల ఆధిపత్యాన్ని అప్రతిహతంగా కొనసాగించటానికి తోడ్పడ్డాయి. ఈ సత్యం అర్థం చేసుకొన్న తెలంగాణ రచయితలు జాగ్రత్త పడ్డారు. తెలంగాణ కథా వార్షికలు తీసుకు రావడం ద్వారా వొక ముఖ్యమైన మార్పుకు పాదులు వేశారు. అయితే, దళిత కథకు సముచిత ప్రధాన్యత దక్కాలంటే, ప్రత్యేక వార్షిక తీసుకు రావాలి. ఆ క్రమంలోనే ఈ 'తొండం బొక్కెన' దళిత కథా వార్షిక 2020 వెలువడుతుంది. రెండు తెలుగు ప్రాంతాల కథకుల ఉమ్మడి వేదికగా ఈ వార్షిక రావడం విశేషం.

ఈ “తొండెం బొక్కెన” దళిత కథా వార్షిక 2020 ఎంతో విశిష్టమైనది. సాహిత్య ప్రజాస్వామ్య భావనకు చక్కటి వ్యక్తీకరణ ఈ సంకలనం. సమ్మిళిత దృష్టి, సామాజిక ప్రజాస్వామ్య అకాంక్ష, దళిత అధునికత, దళిత వాస్తవికత లక్షణాలు ఈ సంకలనం కూర్పులో కనిపిస్తాయి.

- డా. జిలుకర శ్రీనివాస్

గమనిక: "తొండం బొక్కెన" ఈబుక్ సైజు 10.9 mb

Preview download free pdf of this Telugu book is available at Tondam Bokkena