-
-
తొలినాటి గ్రామఫోన్ గాయకులు - రెండు భాగాల సంపుటి
Tolinati Gramophone Gayakulu Rendu Bhagala Samputi
Author: Modali NagabhushanaSarma
Publisher: Creative Links Publications
Pages: 147Language: Telugu
ఇది తొలినాటి గ్రామఫోన్ గాయకులు రెండు భాగాలు కలిపిన సంపుటి.
చిన్నతనం నుంచీ తెలుగు గాయకుల గ్రామఫోను రికార్డులు వింటూ, నలుగురిని పిలిచి వినిపిస్తూ ఉండేవాడిని. నా తోటి పిల్లలు నా ‘పిచ్చి’ని చూసి నవ్వుకునేవారు. పెద్దవాడిని అయిన తరువాత కూడా ఆ రికార్డులలో మన లలిత సంగీత సమ్రాట్టుల పాటలు వింటూ మైమరచిపోతూ వుండేవాడిని. కాని ఈ రికార్డులలో నిక్షిప్తమై వున్న సంగీత సరస్వతిని గురించి నలుగురికీ తెలియజెప్పాలన్న నా ఆకాంక్ష రోజురోజుకూ ఎక్కువ కాసాగింది. ఇన్ని రికార్డులు తిరిగి దొరికేదెలా? అవి జాగ్రత్తపరిచిన వ్యక్తి శ్రీ వి.ఏ.కె.రంగారావుగారు. కానీ ఆయన మద్రాసులో వుంటారు – నాకు సుదూరంగా. నా అదృష్టం కొద్దీ ఒక పుష్కరం క్రితం జె.మధుసూదన శర్మగారు కలిశారు. ఆయన 50 సంవత్సరాలనుంచి రికార్డుల సేకరణలోను, వాటిని భద్రపరచడంలోను, కేటలాగు చేయడంలోను నిమగ్నమై ఉన్నారు. ఆయన సహకారంతో ఆనాటి రికార్డులలోని పాత పాటలను సంగీతాభిలాషులు, నాటకాభిలాషులు అయిన యీతరం వారికి అందించాలన్న తాపత్రయంతో ఈ పనికి పూనుకున్నాను. ఇవి అన్ని అరవై, డెబ్భయ్ ఏళ్ళ నాటి రికార్డులు. ఆనాటి గాయకుల ప్రతిభను గురించి ఈనాటి వారికి ఏమీ తెలియదు. వారిని గురించి నాలుగు ముక్కలు చెప్పగలిగితే వారు పాడిన పాటలను మరికొంత శ్రద్ధాసక్తులతో ఈనాటి శ్రోతలు వినగలరని నాకనిపించింది. అనిపించగానే నా హితాభిలాషులు, నాటక, నాట్య, జానపదకళలలో నిష్ణాతులు – ‘నడిచే నాటిక విజ్ఞానం’గా ఆంధ్రదేశమంతటా పేరుపొందిన ఆచార్య మొదలి నాగభూషణ శర్మగారిని నేను సి.డి.లో యివ్వబోతున్న ఇరవై మంది నిష్ణాతులైన పాతతరం గ్రామఫోను గాయకులను గురించి సంక్షిప్త పరిచయాలను వ్రాయమని కోరాను. ఆయన అంగీకారం నా ప్రయత్నాలకు ఆశీర్వచనమే. ఈ చిన్న పుస్తకానికి ’తొలినాటి గ్రామఫోను గాయకులు’ అని పేరు పెట్టినవారు పెద్దలు, ప్రఖ్యాత నటులు శ్రీ రావి కొండలరావుగారు. వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
- యం. సూరిబాబు
గమనిక: " తొలినాటి గ్రామఫోన్ గాయకులు - రెండు భాగాల సంపుటి " ఈబుక్ సైజు 6.6mb
- ₹216
- ₹162
- ₹192
- ₹108
- ₹108
- ₹108
- ₹129.6
- ₹270
- ₹216
- ₹108
- ₹108