-
-
తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు రెండవ భాగం
Toli Telugu Vyangya Chitraalu Part 2
Author: Talisetti Rama Rao
Pages: 88Language: Telugu
మరుగున పడిన మాణిక్యం
మనకు అందుబాటులో వున్నదానిని బట్టి 1930ల నాటికే భారతి, ఆంధ్రపత్రిక, వాణి లాంటి పత్రికలలో విరివిగా ప్రచురింపబడ్డ ఆయన కార్టూన్లు మనం పరిశీలించినట్లయితే, లైఫ్ స్కెచింగ్పై ఆయన ఎంత శ్రద్ధ పెట్టారో గమనించవచ్చు. ఎంతో సాధన చేస్తేనే గాని రాని ఆ గీతల్లోని పరిణితి, పరిపక్వత, అనాటమీ ప్రతి కదలికల్లో కనపడే భంగిమలు ఇవన్నీ కార్టూన్లలో అప్పటికే అంత గొప్పగా వేయగలిగారూ అంటే దానికి ఆయన ఎంతో సాధన చేసి యుండాలి.
ప్రభంద సుందరి వర్ణనతో మొదలైన అతని కార్టూన్ ప్రస్థానం క్రమక్రమంగా సామాన్యులు, అసామాన్యులు, కూలీలు, పనివాళ్ళు, వారు వీరు అనే బేధం లేకుండా సమాజంలో నిత్యం ఎదురయ్యే వ్యక్తులు, వారి వృత్తులు, దైనందిన వ్యవహారాలు, వేషభాషలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, కళలు, కళాకారులు, ఏ వర్గాన్నీ వదలకుండా అందరిపైనా ఎన్నో కార్టూన్లు వేసారు. ముఖ్యంగా ఆయన కార్టూన్లలో మెచ్చుకోదగ్గ అంశం చక్కని డ్రాయింగ్.
మనం ఇంతకాలం కేవలం ఒక కార్టూనిస్ట్గానే చూస్తున్న తలిశెట్టి రామారావు ఓ మంచి చిత్రకారుడు, రచయిత అంటే ఆశ్చర్యపోక తప్పదు.
- వెంటపల్లి సత్యనారయణ
చిత్రకారుడు, చిత్రకళా రచయిత, కార్టూనిస్ట్
