-
-
తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు
Toli Telugu Vyangya Chitraalu
Author: Talisetti Rama Rao
Language: Telugu
ఈ సంకలనం అపూర్వమైనది.
-ఎ.బి.కె.
తెలుగు కార్టూన్ పితామహుడు
-హెచ్. రమేష్ బాబు
తెలుగువారిలో పత్రికాముఖంగా సుపరిచితుడైన తొలి కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు. ఆంధ్రపత్రికలో అసంఖ్యాకంగా వ్యంగ్యచిత్రాలు వేశాడు. ఆనాడివి బహుళ ప్రజాదరణ పొందాయి. తలిశెట్టి రామారావు హాస్యం - వ్యంగ్యం సున్నితమైనవి. ....
-చలసాని ప్రసాదరావు
తలిశెట్టి వారి కార్టూన్లు పరిశీలిస్తే ఒక నిఘంటువు రాయొచ్చునేమో ననిపించింది. వారి కార్టూనుల్లో అంత సత్తా వుంది. ....
-కార్టూనిస్ట్ జయదేవ్
ఎనభైఏళ్లనాడు వీటిలో ఎంతో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండి ఉండాలి. జనం విస్తుపోయి నవ్వలేక చచ్చి ఉండాలి.
-మోహన్. ఆర్టిస్ట్, కార్టూనిస్ట్
కార్టూనింగ్ ఒక ఆల్కెమీ; ఒక మార్మిక విద్యేమో అని అనిపిస్తోంది. రసవాదం తెలిసినవాడే క్షుద్రలోహాల్ని బంగారం చేయగలిగినట్టు. ఆమర్మం తెలిసినవాడే వేయగలడేమో అనిపిస్తుంది. తలిశెట్టి రామారావు గారి కూర్టూన్లు చూస్తే. తెలుగునాట రామారావు గారు ఒక అద్భుతం. "ఇలాంటి విషయాలపైన కూడా కార్టూన్లు వేయవచ్చా?" అని అబ్బురపడతాం ఆయన కార్టూన్లు చూశాక.
-శ్రీధర్. ఈనాడు కార్టూనిస్ట్
మార్గదర్శకుడు ఈ తలిశెట్టి రామారావు.
-సురేంద్ర. ది హిందూ కార్టూనిస్ట్
ఎప్పుడో 1930లోనే గీసిన కార్టూన్లు 2011లో కూడా అవి ఇప్పటికీ కాంటెంపరరీ కార్టూన్లుగానే అనిపించాయి.
-శంకర్. కార్టూనిస్ట్ సాక్షి డైలీ.
జై తలిశెట్టి... జై తెలుగు కార్టూన్...
-శేఖర్. కార్టూనిస్ట్, ఆంధ్రజ్యోతి డైలీ.
ఇంత అపురూపమయిన ఈ బొమ్మలు, ఈ శైలీ, ఈ వాస్తవికత అప్పటితరం వారి ఆలోచనా శైలిగా దొరకడం మన అదృష్టం.
-బాలి
తెలుగు వ్యంగ్య చిత్రకారుల్లో తొలిశెట్టి రామారావు తలిశెట్టి.
-బాపు
మాట్లాడే బొమ్మలు
-శ్రీరమణ
తెలుగు కార్టూన్ పితామహుడు తలిశెట్టి.
-కళాసాగర్
ఆరుద్ర - కూనలమ్మపదాలు
చిలిపి కుంచెను పట్టి
శ్రీకారమును చుట్టి
నవ్వించె తలిశెట్టి
ఓ కూనలమ్మా!
....
