• Toli Parliamentlo Doctor Ramarao - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తొలి పార్లమెంట్‌లో డాక్టర్ రామారావు (free)

    Toli Parliamentlo Doctor Ramarao - free

    Pages: 231
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆధునిక భారతదేశ చరిత్రలో 1920-1960 మధ్యకాలం అతి కీలకమైన ఘట్టం. ఈ సమయంలోనే అనేక చారిత్రాత్మక సంఘటనలు జరిగాయి. రాజకీయ, సామాజిక భావజాలాల్లో తీవ్రమైన మార్పులు వచ్చాయి. సాంఘిక సంస్కరణలతో ప్రారంభమై, స్వతంత్ర పోరాటంలో భాగంగా కాంగ్రెస్ రాజకీయ పోరాటాలతో ఘనీభవించిన భావజాలం, తరువాతి కాలంలో కాంగ్రెసు విధానాలలోని పరిమితులను అర్థం చేసుకుని, వామపక్ష భావజాలం ప్రచారంలోకి వచ్చింది. వీటన్నిటికి ప్రత్యక్ష సాక్షి డాక్టర్ చెలికాని రామారావుగారు. స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన వెంటనే భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వచ్చిన మార్పులు అర్థం చేసుకోవాలంటే డాక్టర్ రామారావుగారి జీవితం. ఆయన పార్లమెంటు ఉపన్యాసాలలోని స్ఫూర్తిని అర్ధం చేసుకోవాలి. విద్యార్థి దశలోనే సంఘ సంస్కరణ ఉద్యమాలకు ప్రభావితమై స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహించి, ఆ పార్టీ పరిమితులను అర్థం చేసుకుని, ప్రజా సమస్యలపై పోరాటంలో ప్రేరణ పొంది కమ్యూనిస్టుగా మారిన డాక్టర్ రామారావుగారు 1952 ఎన్నికలలో కాకినాడ నియోజక వర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.

పార్లమెంటులో కొన్ని బిల్లులపై చర్చలు అనేక రోజుల పాటు జరిగాయి. అందులో ప్రధానంగా రామారావుగారు చర్చలో పాల్గొన్న తేదీ నాటి ఉపన్యాసాలు మాత్రం ఈ పుస్తకంలో ప్రచురించడం జరిగింది. మిగిలిన రోజుల్లో కూడా చర్చలో రామారావుగారు క్లుప్తం గా స్పందించారు. వాటిని దీనిలో చేర్చలేదు. పార్లమెంటు చర్చలో అనేక సందర్భాల్లో రామారావుగారు మాట్లాడిన అంశాలపై మంత్రులు ఇతర సభ్యులు స్పందించారు. అలాగే వేరే సభ్యులు కూడా మాట్లాడటం జరిగింది. ఉపన్యాసానికి సంబంధం ఉన్నప్పుడు లేదా వారి ఉపన్యాసానికి ప్రతిస్పందనగా మాట్లాడిన సందర్భాల్లో స్పీకర్, మంత్రులు, ఇతర సభ్యుల ప్రతిస్పందనలను ఇందులో సూచించడం జరిగింది.

- పబ్లిషర్స్