-
-
టు మై కంట్రీ విత్ లవ్
To My Country with Love
Author: P. Chandra Sekhara Azad
Publisher: Janaki - Azad Prachuranalu
Pages: 103Language: Telugu
'ఐ లవ్ మై ఇండియా' అనే పేరుతో ఈ నవల అక్టోబర్ 1998లో స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది.
ఈ నవల ఓ ప్రయాణంతో ఆరంభమవుతుంది. అది నా ప్రయాణమే. ఆ ప్రయాణంలో నాకు ఎదురయిన అనుభవాలను రాసాను. ఆయా వ్యక్తులను నేను చూశాను. నిజంగానే ఈ దేశంలో పుట్టి రైలు ప్రయాణంలో మన పక్కన ప్రయాణం చేస్తున్న సోదరుల్ని, ఆక్కచెల్లెళ్ళని, అలాగే అన్ని వయసుల వారిని అనుమానంతో చూడాల్సి రావడం ఓ విషాదం. ఈ నవల రాసేటప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులలో మరింత అభద్రత, అనుమానం వచ్చాయి తప్ప మార్పు రాలేదు.
మన ఊర్లలో, నగరాల్లో క్రైమ్ అనేది సైలంట్‌గా ఎలా పాతుకుపోతుందో, బంధాలు ఎలా మృగ్యం అవుతున్నాయో ఈ నవలలో చెప్పే ప్రయత్నం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మనం విభిన్న కులాల, మతాల మధ్య సామరస్యం ఏర్పరుచుకోలేకపోయాం.
అందుకు అంతరాలు పెరగటం, అభివృద్ధిలో అసమానతలు, ఇంకెన్నో కారణాలు. అవన్నీ రేఖామాత్రంగా చూపించే ప్రయత్నం జరిగింది.
దేశాన్ని ప్రేమించే వారందరి కోసం ఈ రచన.
- పి. చంద్రశేఖర ఆజాద్
