-
-
తిరుపతి తిమ్మప్ప
Tirupati Timmappa
Author: S.K. Ramachandra Rao
Publisher: Arts and Letters
Pages: 279Language: Telugu
ఇప్పుడు తిరుమలగా పేరు కెక్కిన వేంగడము కొండమీద నిలిచియున్న గుడి చాల కాలము నుండి అనేక విధాలుగా జనప్రీతిని గడించుకొన్నది. యాత్రలో ఎదురయ్యే రకరకాల ఇబ్బందుల్ని తట్టుకొని ప్రజలు అక్కడికి పోయిరావటం వేలాది సంవత్సరాలుగా రూపుదిద్దుకొన్న అలవాటు. ఆ దైవాన్ని నమ్ముకొన్నవారు, ఆ దైవానికి మ్రొకుకొన్నవారు, ఆ దైవం కృపాకటాక్ష వీక్షణాలకై అనేక సేవలను చేపట్టినవారు, ఆ దైవాన్ని ఇంటి దేవతగా కలిగినవారూ, దక్షిణ దేశంలోనూ, ఉత్తరదేశంలోనూ అన్ని చోట్లా కనిపిస్తారు. ఇంతగా వున్న ప్రజాభిమానంలోని రహస్యమేమిటి? వేరే ఏ గుళ్ళోనూ కనిపించని కొమ్ములు ఈ గుడికీ పొడుచుకు వచ్చాయంటే అదెట్లా?
ఈ సమస్యను పరిష్కరించడం అంత సులభం కాదు. ఈ కొండ మేరుపర్వతం యొక్క ఒక భాగమని కానీ, గుడిపైన విమానం నేరుగా వైకుంఠం నుండే దిగివచ్చిందన్న నమ్మకం కానీ, గర్భగుడిలోని దైవం వైకుంఠం వదలి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న వైనంగానీ మొదలైన నమ్మకాలు ఈ బహుళ ప్రజాభిమానానికి కారణం కాలేవు. ఇటువంటి కథలు మరే క్షేత్రంలోనైనా వినవచ్చును. బుద్ధిమంతులైన ప్రజలు ఏ కాలంలో కూడ ఈ కథలకు వశ్యులయ్యారని చెప్పలేము. ఈ స్థలం పైని ప్రజాభిమానం ఈ కథల వల్ల కలుగలేదు. అయితే, మరి వేలాది సంవత్సరాల నుండీ ప్రతిదినమూ వేలాదిగా ప్రజలు ఈ కొండనెక్కి గుడిలోనికి జొచ్చి దైవాన్ని చూసి వస్తున్న దాని రహస్యమేమిటి? ఎత్తయిన చోటు, అలౌకిక సన్నిధానం కల దైవం అనే దాన్ని ప్రక్కన పెట్టినా ఇతిహాసం, ఆగమం, ధర్మం, సంస్కృతీ మొదలైన కొన్ని వివరాలిక్కడ మిళితమై ఆకర్షణకు కారణమైనాయి.
దీని ప్రాచీనత, ఘనత, ప్రజాభిమానాల్ని గురించి పదునెనిమిది (అష్టాదశ) పురాణాల్లో కొన్ని కథలు అల్లుకొన్నవి, అయితే పురాణాలు తెలిపే దానికన్నా మిక్కిలి స్వారస్యకరమైన, అచ్చెరువు గొలిపే వివరాలు ఇతిహాసపు పుటల్లో లభ్యమౌతాయి. ఆయాకాలాల్లో గుడికి సంబంధించి వెలసిన శాసనాలూ, గ్రంథాలూ, జనశృతుల్లో చేరిపోయిన కొన్ని ప్రసంగాలూ, జానపద ప్రక్రియలూ ఇలాంటి వివరాలను అందిస్తాయి. ఈ వివరాలన్నిటినీ ఒక్క చోట చేర్చే ప్రయత్నం నాది.
- సాలిగ్రామ కృష్ణరామచంద్రరావ్
