• Tirumalesuni Sannidhilo
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తిరుమలేశుని సన్నిధిలో

    Tirumalesuni Sannidhilo

    Pages: 113
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆకాశవాణి, దూరదర్శన్‌లలో మూడు దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణానంతరం 2005 మార్చిలో హైదరాబాదులో స్థిరపడాలని భావించాను. దైవానుగ్రహం అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ.పి.వి. నారాయణశర్మ రూపంలో నన్ను అనుగ్రహించి 2005 మే నుండి 2010 జూన్ వరకు తిరుమలేశుని సన్నిధిలో పనిచేసే మహాద్భాగ్యం కల్పించింది.

ఆ ఐదేళ్ల కాలంలో శ్రీ వేంకటేశ్వర దృశ్యశ్రవణ ప్రాజెక్టు ద్వారా అన్నమాచార్య కీర్తనలు, వేదాల ఆడియో రికార్డింగులు, పలు ఉత్సవాల వీడియో రికార్డింగులు నా పర్యవేక్షణలో జరిగాయి. 2007 మేలో నా సర్వీసు పొడిగింపు సమయం దేవస్థానం బోర్డు చర్చకు వచ్చింది. “జీతం తీసుకోకుండా స్వామి సేవ చేస్తానంటున్న పద్మనాభరావు పదవీ కాలాన్ని పొడిగిద్దామని” బోర్డులో పట్టుబట్టిన కార్యనిర్వహణాధికారి డా. కె.వి. రమణాచారి సహృదయులు. వారి హయాంలో రెండు సత్కార్యాలలో నేనూ భాగస్వామిని కాగలగడం సుకృతం.

ఒకటి - 2008 మేలో అన్నమాచార్య 600 జయంతి ఉత్సవాల సందర్భంగా తాళ్లపాకలో వెయ్యి మంది సంగీత కళాకారులచే సప్తగిరి సంకీర్తనా గోష్ఠిని నిర్వహించి యావద్భారత దేశంలో ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయించడం.

రెండవది - శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభ సన్నాహాలకు పలుమార్లు, ఢిల్లీ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ అధికారులను సంప్రదించి ఛానల్ లైసెన్స్ సంపాదించి ఛానల్ కార్యరూపం దాల్చడంలో ప్రధమ సేవకుడిగా అంకితం కావడం.

నా ఐదేళ్ల తిరుమల అనుభవాలను కస్తూరి మురళీకృష్ణ తన వెబ్ మ్యాగజైన్ “సంచిక"లో 24 వారాలు ధారావాహికంగా ప్రచురించారు.

- డా. ఆర్. అనంతపద్మనాభరావు

Preview download free pdf of this Telugu book is available at Tirumalesuni Sannidhilo