• Tiger Vatsava
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టైగర్ వాత్సవ

    Tiger Vatsava

    Author:

    Pages: 289
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“నీ గురించి, నీ పార్టనర్ వాత్సవను గురించి మాకు బోలెడన్ని విశేషాలు తెలిశాయి. నీ పార్టనర్ పెద్దపులిలాంటి వాడయితే, నువ్వు తాచు పాము వంటి వాడివని, ఎటువంటి ప్రమాదకర పరిస్థితిలోనయినా సరే గుడ్డిగా ముందుకు దూసుకుపోయే అలవాటు కలవాడివనీ అంటారు. వంటరిగా వచ్చిన నన్ను ఏమీ చేయకుండా వదిలిపెట్టేశావేం? నీ ఓపిక సన్నగిల్లి పోయిందా?” అతని ముఖంలోకి ఓరగా చూస్తూ అడిగాడు ఆ దృఢకాయుడు.

సెగలు వెలువరిస్తున్న కాఫీ కప్పును చూడగానే కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్న సెన్సేషనల్ కలిగింది శ్యామ్‌సుందర్‌కి.

“బెంగుళూరు వాతావరణం నా వంటికి సరిపడలేదు. నా శక్తి యుక్తులన్నీ హరించుకుపోయాయి. ఎందుకూ పనికిరాని వాడిని అయిపోయాను” ఆ వ్యక్తి మాటలకు కోపం తెచ్చుకోకుండా, సాప్ట్‌గా సమాధానం చెపుతూ కాఫీ కప్పును మాటలకు చేతుల్లోకి తీసుకున్నాడు.

“నువ్వు మాకు పట్టుబడిన పరిస్థితిని చూస్తుంటే నీ మాటలు నిజమనే అనిపిస్తున్నాయి. నీ గురించి ఏమేమో గొప్పగా వూహించుకున్నాను. నువ్వు వట్టి పిరికిగొడ్డువని మాత్రం అనుకోలేదు.” కూల్‌గా తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ, వెనుదిరిగి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి.

Preview download free pdf of this Telugu book is available at Tiger Vatsava