-
-
టైగర్
Tiger
Author: C.S.Rayudu
Publisher: Self Published on Kinige
Pages: 133Language: Telugu
ఉదయం తొమ్మిది కావస్తుంది.
శ్రీను డ్యూటీకి వెళ్ళి అరగంట దాటింది. అతడు వెళ్ళెముందు సాయంత్రం తాను ఇవ్వబోయే పదివేల కోసం ఇరవై వేల కళ్ళతో ఆశగా వస్తానని చెప్పాడు.
మంచం మీద కూర్చున్న బుచ్చిబాబు తన చేతిలోని సెల్‌ను బాధగా చూస్తున్నాడు. ఉదయం నుండీ అవంతి ఫోన్‌కు లెక్కలేనన్ని మార్లు డయల్ చేశాడు. స్విచ్చాఫ్ చేసివుందని ఓ శ్రావ్యమయిన ఆడగొంతు వినిపిస్తున్నది చేసిన ప్రతిసారి.
సెల్‌ను గోడకు విసిరి కొట్టాలన్నంత అసహనం ఆవహించిందతన్ని.
ఏమయింది ఆమె సెల్‌కు? తనకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టే జంప్ జిలానీనా ఈ పిల్ల? అందుకే తనకు ఓ కాలం చెల్లిన నెంబరు ఇచ్చిందా? అనుమానాలు బలపడుతూ మరింత బాధకు గురిచేస్తున్నాయిపుడు.
రాత్రి నిద్రపోతున్న సమయంలో ఆమె విజిటింగ్ కార్డులోని నెంబరును ఫీడ్ చేసుకున్నాడు. దాని కింద ఆమె అడ్రస్ కూడా వుందన్న విషయం గుర్తుకొచ్చి చప్పున లేచి కార్డును తీసుకొని చూశాడు.
ఆశ్చర్యం... తను చూస్తున్నది నిజమేనా అన్నంత ఆశ్చర్యానికి లోనయ్యాడు.
అవంతి నివాసముంటున్నది తానుండే ఆనంద్ నగరేనని చూసిన తర్వాత ఆనందం పట్టలేకపోయాడు. వెంటనే బట్టలేసుకుని బయటికి వెళ్ళిపోయాడు.
