-
-
ది టేస్ట్ ఆఫ్ మనీ
The Taste of Money
Author: Jagan
Publisher: Sujan Publishers
Pages: 120Language: Telugu
15 కేన్స్ సినిమా కథలు
ఆరుదశాబ్దాలకు పైగా వరుస తప్పకుండా జరుగుతున్న కాన్ చలనచిత్రోత్సవాలు వ్యాపారాత్మకమైన, ఆడంబరమైన, ప్రధానస్రవంతి సినిమాలకు కాక, మంచి సినిమాలకు, సున్నితమైన సినిమాలకు వేదికగా ఉంటూ వచ్చాయనేది తెలిసిందే. 2012లో జరిగిన కాన్ ఉత్సవాలకు స్వయంగా హాజరైన జగన్, ఉత్తమ చిత్రాలుగా పరిగణన పొందిన వాటితో సహా ఒక పదిహేను మంచి సినిమాలను ఏరి, ఈ పుస్తకంలో పరిచయం చేశారు. పదిహేను ఉత్తమశ్రేణి కథానికలను చదివిన అనుభూతి కూడా ఈ రచనతో పాటు ఉచితం.
సినిమాల పరిచయం అంటే కథాపరిచయమేనా అని సందేహం కలుగుతుంది. కానీ, జగన్ కథను సినిమా వ్యాకరణంలో రాసి మనకు అందించారని గుర్తించాలి. మానవ సంబంధాలలోని సున్నితత్వాలు, సంక్లిష్టతలు, అనివార్యతలు, బలహీనతలు, మనుషుల ఎంపికల్లోని వేదనలు ఇతివృత్తాలుగా నిర్మించిన సినిమాలు ఇవి. మానవ స్పందనలను, చర్యలను అతి నిర్దిష్టతనుంచి, సూక్ష్మత నుంచి ఈ సినిమాలు చిత్రీకరించాయి.
మాములు కథలాగా కాకుండా, ఆ చిత్రదర్శకుడే పాఠకుడికి కథను వివరిస్తున్నట్లు జగన్ ఈ సినిమాలను పరిచయం చేశారు. ఆ శైలి మనకు సినిమానే చూపిస్తుంది. తన కనులు మనవి చేసుకుని ఆయన ఆ సినిమాలు చూసినట్లనిపిస్తుంది. అందుకే ఈ పుస్తకానికి పఠనీయత అధికం.
అందమైన వర్ణచిత్రాలున్న ఈ పుస్తకం కాస్త విభిన్న పరిమాణం కలిగి ఉంది. 9.53 x 8.81 అంగుళాలు దీని పరిమాణం.
