-
-
ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ అభిమాని
The Rise and Fall of Abimani
Author: Dr. Lenin Dhanisetty
Publisher: Penneti Publications Kadapa
Pages: 19Language: Telugu
సినిమాహాలు కేవలం రేకులతో కప్పిన ఒక దీర్ఘచతురస్ర స్థలం కాదు. అది మొత్తం మానవ సమాజపు మనస్తత్వాన్ని నిర్దేశించే ప్రదేశం. ప్రయోగశాల. అందులోని వెండితెర వెలుగులకు దీపం పురుగుల్లా మారిన లక్షలాది/కోట్లాది బహుజన అభిమానుల్లో ఒకడి జీవిత కథ ఇది.
ఈ కథను అచ్చులోకి రాకముందే ఫోటోస్టాట్ ప్రతుల రూపంలో వందలాది నాన్-లిటరరీ ఎడోలిసెంట్ పాఠకులు చదివారు... మిత్రుల చేత చదివించారు. ఆ తర్వాత...
ఐ వజ్ షాక్డ్ అండ్ డిప్రెసెడ్ - కొండ వెంకటేష్, తిరుపతి/తిరుమల
ఇదంతా నా కథే - హరీష్ ముదించ కువ్వాకుల, బెంగళూరు
అబ్జార్బింగ్, హై లెవెల్ డైనమైట్ - పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, పలమనేరు /పూనా
బ్రీత్లెస్ నెరేషన్ - పవన్ మాదిగ /వెంకటగిరి
"కెవ్వు కేక" - సుబ్బుగారి వెంగయ్య రాయల్ / రాజంపేట
చదివాక కన్నీళ్ళు కార్చాను - ఎం. ఎస్. నాయుడు, గుంటూరు; కె. భాస్కర్, నెల్లూరు
చెత్తకథ... ఇదంతా నిజమేనా? - కె. బాలాజీ చౌదరి, హైదరాబాద్.
పచ్చి సామాజిక వాస్తవికత - విమల్ మాదిగ /గూడూరు
భారతదేశంలో అంతర్జాతీయ స్థాయి రచయితల్లో ఒకరైన డాక్టర్ లెనిన్ ధనిశెట్టి వాస్తవ సంఘటనలకు ఊహను జోడించి రాసిన ఈ కథ ఒట్టి కథకాదు... ఇదో గ్రౌండ్ రియాలిటీ... ఏ రచయితా చెప్పేందుకు సాహసించని అండర్‌గ్రౌండ్ రియాలిటీ.
చదవవలసిన పుస్తకం