-
-
తీర్థయాత్రికుని ప్రగతి
The Piligrims Progress
Author: Dr. Lanka Siva Rama Prasad
Publisher: Dr. Lanka Siva Rama Prasad
Pages: 219Language: Telugu
"The Pilgrim's Progress” (తీర్థయాత్రికుని ప్రగతి) this world to that which is to come - ఆంగ్లభాషలో ఒకప్పుడు బైబిల్ తరువాత స్థానాన్ని పొందిన రచన. రెండు వందలకు పైగా భాషలలోకి అనువదించబడి ప్రొటెస్టంట్ క్లిస్టియన్లచే అభిమానించబడి, మతగ్రంథాలలో, ప్రతీకాత్మక కావ్యాలలో అత్యున్నత స్థానాన్ని పొందిన అద్భుత రచన ఇది.
జాన్ బున్యన్ (John Bunyan -28-11-1628 శిళి 31-8-1688) అతి సాధారణ కుటుంబంలో పుట్టినవాడు. గ్రామీణుడు. వీధి వర్తకుడు (Chapman). పాత్రలకు అతుకులు వేసేవాడు (Tinker). తరువాత పార్లమెంటరీ సైన్యంలో చేరినాడు. చాలాకాలం దైవానికి తిరస్కారభావంతో (Profanity) ఉన్న అతనికి ఓరోజు కలలో – “Wilt though leave thy sins and go to heaven or have thy sins and go to hell?” దేవుని ఆజ్ఞ వినిపించి ఆరోజు నుంచి బైబిల్ పఠనంలో, జాన్ గిఫర్డ్ శిష్యరికంలో బాప్టిజం పొంది, క్రమేపీ మత బోధన ప్రారంభించాడు.
ఛార్లెస్-2 రాజైన తరువాత ఆంగ్లికన్ చర్చి ప్రాధాన్యత పెరగగా జాన్ బున్యన్ దానిని వ్యతిరేకించి 1660లో జైలు పాలైనాడు. 1672లో విడుదలై 'బిషప్ బున్యన్'గా పేరొందినా, 1675లో తిరిగి Bedford Town Jailలో ఉంచబడినాడు. 1678లో The Pilgrim's Progress మొదటిభాగం, 1684లో రెండవ భాగం ప్రచురింపబడి అత్యంత ప్రజాదరణ పొందాయి.
సుమారు అరవై పుస్తకాలు (The holy war - ప్రముఖమైనది) రచించిన ఇతడు జాన్ మిల్టన్కు సమకాలికుడు. రుడ్యార్డ్ కిప్లింగ్ ఒకప్పుడు జాన్బున్యన్ గురించి ఇలా వ్రాసినాడు – “The father of the novel, salvation's first Defoe”.
తెలుగు సాహితీ ప్రపంచానికి సృజనలోకం అందిస్తున్న మరో కానుక ఈ అద్భుత ప్రతీకాత్మక కావ్యం ''తీర్థయాత్రికుని ప్రగతి''
- డాక్టర్ లంకా శివరామప్రసాద్

- ₹540
- ₹324
- ₹270
- ₹216
- ₹270
- ₹324
- ₹540
- ₹324
- ₹270
- ₹216
- ₹270
- ₹324