-
-
ది లీడర్
The Leader
Author: Vijayarke
Publisher: Self Published on Kinige
Pages: 128Language: Telugu
ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన ఫార్మూలా....కొత్త విషయం... ప్రపంచగమనాన్ని మారుస్తుంది.
ఒక స్వాతంత్ర్య పోరాటం దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఒక వ్యక్తి సాధించిన విజయం వ్యవస్థకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
ఆలోచన అభివృద్ధికి, కృషి సాధనకు పట్టుదల గెలుపుకు దారితీస్తుంది.
అలా ఒక వ్యక్తి ఆలోచన ఆశయంగా, మారి ఆచరణలో తెలంగాణా రాష్ట్రంగా ఏర్పడింది.
ఆ వ్యక్తి తెలంగాణా రాష్ట్ర ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
కెసీఆర్ గా సుపరిచితులు...
మనం పుట్టినప్పుడు మనకు తల్లిదండ్రులు ఒక పేరు అది ఆ కుటుంబానికి, బంధువులకు స్నేహితులకు మాత్రమే తెలుస్తుంది.
కానీ అదే వ్యక్తి విజయాలను సాధించినప్పుడు... తనలోని వ్యక్తిత్వాన్ని, ప్రతిభను, కార్యాచరణను, ఆశయాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ప్రపంచమంతా గుర్తిస్తుంది.
అది ఉద్యమం కావచ్చు... సామాజిక సేవ కావచ్చు.. సరికొత్త ఆవిష్కరణ కావచ్చు.
మహాత్ముడు.. మదర్ థెరీసా, నెల్సన్ మండేలా, నేతాజీ, గ్రాహంబెల్, ఐన్ స్టీయిన్ ఇలా ఏ రంగానికి చెందినవారు అయినా ప్రపంచంలో ఒక కొత్త ఒరవడి. కొత్త ఆవిష్కరణ, ఇతరులకు స్ఫూర్తి కలిగించే పరంపరలో, చరిత్రలో నిలిచిపోతారు.
ఇతరులకు స్ఫూర్తిని ఇస్తారు.
అలా ఒక చరిత్ర సృష్టించిన వర్తమానపు కథానాయకుడు కెసీఆర్ అన్నది మనం ఒప్పుకుని తీరవలిసిన చారిత్రాత్మక వాస్తవం.
ఈ వాస్తవానికి ఒక అక్షర రూపం అనివార్యం. చరిత్రలో నిలిచిన ఈ చారిత్రాత్మక సంఘటన యువతకు, ప్రజలకు రేపటితరానికి తెలియజేయవలిసిన బాధ్యతగా భావించాను.
దాదాపు ముప్పై మూడేళ్ళ రచనా ప్రస్థానంలో జర్నలిస్ట్ గా, కాలమిస్ట్ గా నేను చేసిన రచనలకు ఇది కొద్దిగా భిన్నం.. విభిన్నం ..
కేసీఆర్ వ్యక్తిత్వాన్ని విశ్లేషించే చిన్ని ప్రయత్నం...
ఇది పూర్తిస్థాయి విశ్లేషణ కాదు... వార్తల ఆధారంగా, ఇతరులు వెలుబుచ్చిన, వర్తమానంలో జరిగిన సంఘటనలు...
ఒక రేఖామాత్రంగా స్పృశించిన సృజన.
ఈ పుస్తకం చదివి లీడర్ షిప్ క్వాలిటీస్ ను అర్థం చేసుకుని లేదా ఈ పుస్తకం స్ఫూర్తితో ఏ ఒక్కరు స్పందించి గెలుపును సాధించినా మరో కొత్తనాయకుడు తయారు కాబడినా మా ప్రయత్నం ఫలించినట్టే...
- విజయార్కె
కేసీఆర్ గారి ఉద్యమస్ఫూర్తిని వ్యక్తిత్వాన్ని చక్కగా విశ్లేషించారు.కేసీఆర్ మార్క్ మతాల తూటాలు..." తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ చచ్చుడో " తెలంగాణ ఉద్యమానికి దూసుకువచ్చిన తూటాలు.వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా కేసీఆర్ రాజకీయ ప్రజా ఉద్యమ జీవితాన్ని వివరించిన తీరు చాలా బావుంది.కేసీఆర్ అభిమానులే కాదు ముందుతరం రాజకీయనాయకులకు ఒక సిలబస్ లాంటిది.
ప్రముఖరచయితగా జర్నలిస్ట్ గా విజయార్కెగారి శైలి పరిశీలనాత్మక కథనం విశ్లేషణ చాలా బావుంది.సహరచయితతో ముందుమాటలో చెప్పింది నూటికి నూరుపాళ్ల్లు నిజం
ఈ పుస్తకం కేవలం ఒక పార్టీ నాయకుడి పరంగా కాకుండా ఒకవ్యక్తి పోరాటస్ఫూర్తి వ్యక్తిత్వం కోణంలో కూడా చూస్తే..లీడర్ షిప్ క్వాలిటీస్ వ్యక్తిత్వవికాస పాఠాన్ని చెబుతాయి అనిపిస్తూఉంది.రచయిత చెప్పినట్టుగా...
ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన ఫార్మూలా....కొత్త విషయం... ప్రపంచగమనాన్ని మారుస్తుంది.
ఒక స్వాతంత్ర్య పోరాటం దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఒక వ్యక్తి సాధించిన విజయం వ్యవస్థకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
ఆలోచన అభివృద్ధికి, కృషి సాధనకు పట్టుదల గెలుపుకు దారితీస్తుంది.
కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
" ది లీడర్ " పుస్తకం కేసీఆర్ గారి వ్యక్తిత్వానికి అద్దం పట్టింది.
" ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన ఫార్మూలా....కొత్త విషయం... ప్రపంచగమనాన్ని మారుస్తుంది.
ఒక స్వాతంత్ర్య పోరాటం దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఒక వ్యక్తి సాధించిన విజయం వ్యవస్థకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
ఆలోచన అభివృద్ధికి, కృషి సాధనకు పట్టుదల గెలుపుకు దారితీస్తుంది."
ఈ వాక్యాలు అక్షసత్యాలు.ఇది ఒక వ్యక్తి సక్సెస్ స్టోరీ కాదు..ఒక వ్యక్తిత్వవికాస గ్రంథం.కేసీఆర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి..అందులో ఎలాంటి లక్షణాలను స్వీకరించాలో చెప్పారు.
కాలక్షేపానికి కాకుండా జీవితంలో ఎలా ఎదగాలి ఎలా లీడర్ గా మారవచ్చో చెప్పే పుస్తకం.
కేసీఆర్ అభిమానులే కాదు ముందుతరం రాజకీయనాయకులకు ఒక సిలబస్ లాంటిది.
ఒక నాయకుడికి వుండవలిసిన లక్షణాలను విశ్లేషణాత్మకంగా వివరించిన తీరు బావుంది.
ప్రముఖరచయితగా జర్నలిస్ట్ గా విజయార్కెగారి శైలి పరిశీలనాత్మక కథనం విశ్లేషణ చాలా బావుంది.