-
-
ది డాక్టర్స్ కాలేజ్
The Doctors College
Author: Dr.G.Suresh babu
Publisher: Self Published on Kinige
Pages: 240Language: Telugu
ఇది నా అచ్చైన తొలి నవల! స్వాతి సపరివార పత్రిక యాజమాన్యం, సిబ్బందికి నా కృతజ్ఞతలు. నా చిన్నప్పుడు ‘హౌస్ సర్జన్’ కొమ్మూరి గారి నవల చదివినప్పుడు; గొరుసు, రాజి గార్లు ఇచ్చిన డాక్టర్ కేశవరెడ్డి గారి ‘సిటీ బ్యూటిఫుల్’ చదివినప్పుడు; నవీన్ గారి ’అంపశయ్య’ చదివినప్పుడు... కనీసం వాటి స్థాయికి తగ్గ నవల రాయాలని సంవత్సరం పాటు చేసిన శ్రమే... ఈ ‘ది డాక్టర్స్ కాలేజ్.’
‘హాపీడేస్’ సినిమా చూశాక మెడికోలకు కూడా తమదైన జ్ఞాపకాలు వుంటాయి, వాటి నెందుకు ప్రజల్లోకి తీస్కెళ్ళకూడదు? డాక్టరు కం రచయితగా వున్న నేను ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు!? అనే ఆలోచన రాగానే ఇంక ఆగలేదు.
ఇందులో జోగిని సిస్టం, చేతబడులు లాంటి మూఢాచారాల్ని పొందుపరిచాను. గోకుల్ ఛాట్ బాంబ్ బ్లాస్ట్, కర్నూలు వరదలు లాంటి ఉపద్రవాల్ని కూడా చెప్పాను. నా స్వీయానుభవాలు, ఇతరుల అనుభవాలు పొదిగి నవలను పరిపూర్ణం చేశాను.
- డా. జి. సురేష్ బాబు
* * *
డా. జి. సురేష్ బాబు వృత్తి రీత్యా వైద్యులు. నల్లగొండలో 25.4.1971న శ్రీ గంజి సత్తయ్య, శ్రీమతి స్వరాజ్యం దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. బాల్యం నుంచే సాహిత్యాభిలాషి. యండమూరి, చలం, మల్లాది, కుష్యంత్ సింగ్ రచనలు విడవకుండా చదివి 2004 నుంచి తానూ రచయితగా తయారైనారు. వీరి కథలు పలు పత్రికల్లో అచ్చైనై. సాక్షి ఫన్డే పాఠకులకు సుపరిచితులే.
అడిగినంత జాబిలొస్తే వెన్నెలెలా ఔనులే, కలేకననులే, హాలీవుడ్ మూవీ క్విక్ రెంటల్ గైడ్ అనే 3 పుస్తకాలు వెలువరించారు. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం. తెలుసు పాఠకుల సంఖ్య పెంచే ప్రయత్నంలో తన వంతు కృషిగా విభిన్న అంశాలను నిర్భయంగా, స్పష్టంగా,క్లుప్తంగా రాయడం వీరి ప్రత్యేకత.
Just as the author said, the book is similar to ‘Happy Days’ movie with a medical background.