-
-
ది కర్స్ ఆఫ్ కుంగ్ ఫూ
The Curse of Kung Fu
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 163Language: Telugu
"మానవ సహజమైన కోరికలు కోరి మీ మహిమను కించపరచటం నాకు చేతకాదు. నేను బయలు దేరిన పని విజయవంతమవ్వాలని ఆశీర్వదించండి... చాలు." మరింత వినయంగా అన్నాడు షాడో.
"ఏ పని విజయవంతం కావాలని ఆశీర్వదించను? మొదటిదా, రెండవదా??" చిరునవ్వులు చిందిస్తూ అడిగాడు బెప్పో.
హెలీకాప్టర్లో నుంచి దిగీ దిగటంతోనే లెఫ్ట్రైట్లు ప్రారంభించటం వల్ల అలసట అధికమై తన మతి కాస్తంత మందగించిందేమోనన్న అనుమానం వెంటనే అడుగు పెట్టింది షాడో హృదయంలో.
ఎన్నిపనుల మీద బయలుదేరాడు తను?
మహిమాకో అడవుల్లోకి వచ్చి అడ్రసులు లేకుండా గల్లంతయి పోయిన గంగారాం కోసం పెట్టుకున్న ఒకే ఒక పని మీద కదా!
అతని ఆలోచనలన్నీ తనకు అర్ధం అవుతున్నట్లు మరింత చిద్విలాసంగా నవ్వి,కనులు చిట్లించాడు బెప్పో.
"కోటి పడగలతో ఈ భూమిని కాపలా కాస్తూ వుండే కకుటూ కాలసర్పం మాదిరి నీ జీవితాన్ని కాపాడుతూ వుంటుంది స్నేహమనే దైవీకమైన లక్షణం. పరకీ శిఖర దర్శనమైన మరుక్షణం ప్రబలమౌతుందది... కనీ వినీ ఎరుగని అనుభవాలు నీ జీవితాన్ని అలుముకోవటానికి కారణమవుతుంది. క్షేమంగా పోయి లాభంగా తిరిగి రా... వెళ్ళు..." పూనకం వచ్చిన వాడిలా వెనక్కి ముందుకీ ఊగిపోతూ చెప్పాడు.
తన మతి మరింతగా మందగించి పోతున్నట్లు అనిపించింది షాడోకి.
very interesting!
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.