-
-
The Art of the Possible
Author: Chembolu Sriramasastry
Publisher: Chembolu Sriramasastry
Pages: 286Language: English
Sri Sarabhayya’s life has in no measure been a normal and average middle class person’s life. Is it then an epoch making one like Gandhi’s or Ambani’s? Of course not! His life is a story of a very hard struggle culminating into a successful and pleasurable one.
I am sure, ‘Life’ after all is the most interesting subject matter of the entire literature. Every life as such is unique in its own way. Visiting innumerable accounts of life will enrich one’s own experience and broadens the horizons of observation, understanding, adaptation and finally refinement of one’s own life for the better. I would be happy if this small bunch of his experiences gives a little fillip to such people who are in the midst of struggle, dilemma and despair to surge ahead.
- C.S. Sastry
* * *
ఒక అతి మాములు మనిషి, మందలో ఒకడిగా పుట్టి, జనాభా గణనలోని నామమాత్రుడుగానే ఒదిగి, కనీసం ఒక లోకల్ పేపర్ లోపలి పేజీల్లో ఒక్క చిన్నమూల ఓ కొన్నక్షరాల కాలాన్ని (column) కూడా క్లెయిమ్ చేయకుండా ఏళ్ళు గడిపి, సమయం మీద సంతకం చేయడాలూ, చరిత్రలో ఛాప్టర్ దొరకబుచ్చుకోడాలూ లాంటి చేతబడులూ అవీ చేయకుండా ఒకానొక అతి మాములు మనిషిలాగే బ్రతికేసి, బత్రికేస్తూ కూడా....
తన చిన్న జీవనపరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరి అంతరంగంలోనూ, సుషుప్తావస్థలో ఉన్న మనిషితనం చటుక్కున లేచేలా చేసి 'ఓహో' 'మనిషి' అంటే ఇది గదా! ఎవరైనా ఎంతటివారైనా ఏమి సాధించినా, మానినా, ఇదిగో ఇలా ఉన్నప్పుడు గదా! 'మనిషి' అనిపించుకునేది. Before శరభయ్య, after శరభయ్య రెండు భాగాలుగా ఎన్నో బ్రతుకులు తమ గమనాన్ని కాలగణన చేసుకోడం లాంటి.....
ఒక సామెతలాంటి, ఒక నానుడిలాంటి, ఓ మూడడుగుల పొట్టి బుడతడి వామనత్వంలోని త్త్రైవిక్రమంలాంటి ఒకానొక మహేతిహాసం శరభయ్యగారి కథ
- 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి
