• Thapthasila
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తప్తశిల

    Thapthasila

    Pages: 141
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"డాక్టర్! నన్ను త్వరగా చెక్ చేయండి ప్లీజ్! ఒంటిగంటకల్లా ఇంటికి వెళ్ళాలి"

గబగబా అనేసింది.

డాక్టర్ ఆమెకేసి అసహనంగా చూశాడు.

"తొందరపడితే ఎలాగమ్మా! నేను ఖాళీగా లేనుగా" శాంతం నటించాడు.

"మావారికి ఒంటిగంటకి భోజనం పెట్టాలి. ఆయన నాకోసం ఎదురు చూస్తుంటారు" సంజాయిషీగా అంది.

డాక్టర్ కనుబొమలు ముడిపడ్డాయి. మిగతావాళ్ళు వెళ్ళిపోయారు.

"ఇలా రండి.. కూర్చోండి" అంటూ పరీక్ష చేస్తూ అన్నాడు.

"అవే మందులు వాడండి.. కాస్త లేటయితే మీవారు తినేయొచ్చుగా! ఇలా నన్ను హడావుడి చేస్తే ఎలా! అప్పుడప్పుడు సర్దుకుపోవాలి" అనునయంగా అన్నాడు.

"నిజమే!... గత అయిదేళ్ళుగా మేం కలిసే తింటున్నామండీ" సంజాయిషీగా అంది.

"ఈ ఒక్కరోజు మీకోసం కాసేపాగుతారులెండి" ప్రిస్రిప్షన్ రాస్తూ చిన్నగా నవ్వాడు.

"లేదండీ. ఆగరు..." ఖచ్చితంగా అంది.

"ఏం?ఎందుకని? ఆగకపోతే తినేస్తారు అంతేగదా"

"తినరు. నేనెవరో ఆయనకు గత ఐదేళ్ళుగా తెలీదు" ఆమెగొంతు వణికింది.

Preview download free pdf of this Telugu book is available at Thapthasila