-
-
తెరవెనుక నీడ
Tera Venuka Needa
Author: N S Nagireddy
Publisher: Self Published on Kinige
Pages: 180Language: Telugu
''యు డర్టీ ఇండియన్ ఏజంట్...! ఇది కేవలం పులిబోను మాత్రమే కాదు... అడుగుగునా పదునైన కత్తులు వుంటాయి. మా కళ్ళల్లో కారంగొట్టి తప్పించుకోవడం నీ తరంకాదని నీకు ఇప్పటికైనా అర్థమయిందా?'' అన్నాడు ఎగతాళిగా.
ఉత్తేజ్కి అతని మాటలు అసలు చెవికెక్కడంలేదు. అతని చూపులు ఆ యువతిమీద... జహనారా మీదే నిలిచిపోయాయి.
అతని మనసు బాణం దెబ్బతగిలిన దానిలా 'జ...హ...నా...రా...' అంది విల-విలలాడిపోతూ.
మెట్లమీద నిలబడి వున్న జహనారా స్మిత్ అండ్ వెస్సన్ పిస్తోలుని పేల్చిన తొలిక్షణంలో చూడలేదతని ముఖాన్ని. అతని వెనుక వైపు నిలబడి వుండటం వలన అందుకు ఎంత మాత్రం అవకాశం లేకపోయింది.
అతను తనకేసి తలతిప్పినప్పుడు తొలిసారి చూసింది. తృటికాలం... తన కళ్ళముందు తటిళ్ళున విద్యుల్లత మెరిసినట్లయింది.
సందేహంగా... నిజమా... కాదా... అన్నట్లుగా కళ్ళు పెద్దవిచేసి మరీ చూసింది...
అంతే! మరుక్షణం జహనారా ముఖం తెల్లగా పాలిపోయింది.
ఆమె ఎర్రని చెక్కిళ్ళల్లో రక్తం ఇంకిపోయింది. అప్రయత్నంగానే ఆమె ఒడలు నిలువెల్లా కరెంట్ షాక్ తగిలినట్లు కంపించిపోయింది.
''ఉ...త్తే...జ్...!'' ఆమె పెదవులు చాలా అస్పష్టంగా పలకరించాయి. 'ఇన్నేళ్ళకు... ఇప్పుడు... ఇలా.... తన భర్త సమక్షంలో కనిపించాడేమిటి?'
ఆమె లోలోపల విచిత్రమయిన ప్రకంపన... కాళ్ళు కంపించిపోతూ నిలవలేనంటున్నాయి. పూలతీగ సన్నగా వణికినట్లు ఆమె తనూలత నిలువెల్లా ప్రకంపనాలకు గురయిపోతోంది.
No words about this book
Marvellous is very less