• Telugunata Dalita Rajakeeyalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగునాట దళిత రాజకీయాలు

    Telugunata Dalita Rajakeeyalu

    Pages: 187
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాంబయ్య సామాజిక న్యాయవాది. ఆవేశం కంటే ఆలోచన ముఖ్యమని భావించే మూలవాసి. ఆ విషయంలో అక్షరాలా ప్రతిభాశాలి. సాంబయ్య కేవలం దళిత రాజకీయాలకు మాత్రమే పరిమితమైనవాడు కాదు. అతని వ్యాసాలలో, ఉపన్యాసాలలో అంతర్జాతీయ చర్చనీయాంశాలు విభిన్న కోణాలను ఆవిష్కరిస్తాయి. సాంబయ్యకు ఒక్క తెలుగునాట మాత్రమే కాదు, భారత దేశ వర్తమాన రాజకీయాల మీద కూడా మంచి పట్టు వుంది. జరుగుతున్న పరిణామాలను విశ్లేషించడంలోనూ తనదైన సైద్ధాంతిక దృక్పథముంది.

ఈ గ్రంథంలో సాంబయ్య వ్యక్తీకరించిన భావనలు కార్యరూపం దాల్చితే దళిత బహుజనులు సమైక్యంగా ఆలోచించి ఒక రాజకీయ శక్తిగా ఉద్యమిస్తే 'దిల్లీ అభీ దూర్ నహీ'! అనే నినాదం నిజమవుతుంది.

ఈ గ్రంథం సమకాలీన బహుజన రాజకీయాలకు పాఠ్య గ్రంథం లాంటిది.

- ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్

భారతదేశంలో ఆధునిక రాజకీయాలు వలస కాలం నుండి కూడా ఏ విధంగా బ్రాహ్మణిజం పునాదిపై నిర్మితమయ్యయో సాంబయ్య స్పష్టంగా వెలికి తెచ్చాడు. ఆ క్రమం దళితులను ఆధునిక రాజకీయాల నుండి ఒక పద్ధతి ప్రకారం మినహాయించింది. ఆధునిక ప్రజాస్వామ్యం దళితులకు సంఖ్యాపరమైన ప్రాతినిధ్యాన్ని మాత్రమే కల్పిస్తుందని, రాజకీయ అధికారంలో సమాన భాగస్వామ్యం కాదని ఈ పుస్తకం వాదిస్తుంది. దేశవ్యాప్తంగా దళితులు ఈ అంశాన్నే సవాలు చేస్తున్నారు. బ్రాహ్మణీయ రాజకీయ ఆధిపత్యాన్ని దళితులు వ్యతిరేకించి ఎదిరించటం ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క విధంగా వుందని నిరూపించటంలో ఈ పుస్తకం జాగ్రత్త తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో దళిత ప్రత్యామ్నాయ కథనాలను సాంబయ్య అద్భుతంగా వర్ణించాడు. ఈ వర్ణన దళిత బహుజన రాజకీయాలలోని అంతర్గత వైరుధ్యాన్ని వెలుగులోకి తీసుకురావటమే గాక దానినుండి బయటపడే మార్గాన్ని కూడా సూచిస్తుంది.

- ప్రొఫెసర్ భంగ్య భూక్యా

Preview download free pdf of this Telugu book is available at Telugunata Dalita Rajakeeyalu