• Telugu Samethalu Manava Manastatva Vishleshana
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 108
  120
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • తెలుగు సామెతలు- మానవ మనస్తత్వ విశ్లేషణ

  Telugu Samethalu Manava Manastatva Vishleshana

  Pages: 150
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

జీవితం నేర్పే గుణపాఠం అనుభవం, అనుభవం అందించే సందేశం సామెత. సామెతలో స్థూలమైన అర్థ నిర్ణయం వెనుక గంభీరమైన జీవన మధనం గోచరిస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరివల్ల పుట్టాయో తెలియని సామెతలు ఈనాటికీ భిన్న మానవ మనస్తత్వ ప్రతిబింబాలుగా జీవితానికి అద్దం పడుతున్నాయంటే అసత్యం కాదు.

యుగాల మానవ చరిత్రలో సాంకేతికంగా ఎంతో ప్రగతిని సాధించినా, సమాజంలో మనకి పైకి కనిపించే వ్యక్తి వేరుగా, అసలు వ్యక్తి (స్వభావం) వేరుగా గోచరించడం జరుగుతోంది. కాలానుగుణంగా సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనిషి ఆలోచనా విధానంలోనూ మార్పు వచ్చింది. కనుక సామెతలు మానవ మనస్తత్వాలని విభిన్న కోణాలలో విశ్లేషించిన తీరు చెప్పుకో తగినది.

అనేక విశ్వవిద్యాలయాలలో ఎన్నో అంశాలమీద పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ప్రత్యేకంగా సామెతల ఆధారంగా జరిగిన పరిశోధనలు మాత్రం కేవలం ఇరవై రెండు (ఈ సిద్ధాంత వ్యాస రచనాకాలం 2000 సం. నాటికి). అవి కూడా చాలావరకు సామెతల సేకరణ, భాషా పరిశీలన, తెలుగు సామెతలకు - యితర భాషా సామెతలకు గల సామ్యాలు, తులనాత్మక పరిశీలనలు వంటివే జరిగాయి తప్ప మనస్తత్వ పరిశీలన దృష్ట్యా పూర్తిస్థాయి సిద్ధాంత వ్యాస రచన జరగలేదు. ఈ సిద్ధాంత వ్యాసం “తెలుగు సామెతలు- మానవ మనస్తత్వ విశ్లేషణ”కు మాత్రమే పరిమితం.

మనిషి ఒంటరిగా వున్నప్పటి ప్రవర్తనకి, పదిమందిలో వున్నప్పటి ప్రవర్తనకి చాలా తేడా వుంటుంది. ఉదాహరణకి- “ఏండ్లు ఎగసన బుద్ధి దిగసన” “కులం కొద్దీ గుణం” “గుంపులో గోవిందా” మొదలైన సామెతలలో కూడా మనస్తత్వాలే ప్రతిబింబిస్తున్నప్పటికీ ప్రత్యేకించి వర్గీకరణ చేసి చెప్పడానికి అనువైనవిగా లేవు. కనుక అటువంటి సామెతలని విడిచి ఖచ్చితమైన మనస్తత్వ నిర్థారణ చేసి, వివరించి చెప్పగల వాటిని మాత్రమే ఎన్నుకుని, మనోవైజ్ఞానిక దృక్పథంలో (Psychological Aspect) పరిశీలించి, సామెతలలో కనిపిస్తున్న కొన్ని వ్యక్తిత్వ లోపాలకి, కొన్ని రుగ్మతలకి, కొన్ని సమస్యలకి, కొన్ని మూఢనమ్మకాలకి కారణాలు శోధించి, వివరణలిచ్చి సాధ్యమైనంత వరకు పరిష్కారాలని సూచించడం జరిగింది.

మనిషి జీవితానుభవాన్ని క్రోడీకరించి చెప్పిన వాక్యం “సామెత” అయితే, మానవ మనస్తత్వ అధ్యయనం చేసి, ఎందరినో పరిశీలించి, మనిషి స్వభావాన్ని విశ్లేషించి, సోదాహరణంగా వివరించి చెప్పే శాస్త్రం- 'మనస్తత్వ శాస్త్రం' - Psychology. మన చుట్టూ వున్న వ్యక్తులలో మనకు సాధారణంగా కనిపించే ఎన్నో లక్షణాలు రుగ్మతలే నంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. వీటివల్ల యితరులకి యిబ్బందులు కలుగకపోయినా, వారికి సంబంధించిన వ్యక్తులకి మాత్రం ఎంతో అసౌకర్యం కలుగుతుంది వీటివల్ల ఒక్కొకసారి చిక్కుల్లో పడడం, జీవితంలో సుఖసంతోషాలు కోల్పోవడం కూడా సంభవిస్తుంటుంది.

“తెలుగు సామెతలు - మానవ మనస్తత్వ విశ్లేషణ” అన్న అంశాన్ని పరిశోధనకు స్వీకరించిన తరువాత పర్యవేక్షకులతో చర్చించి, అవసరమైన సామెతలను అధ్యాయాలకి అనుగుణంగా క్రమబద్ధం చేసుకుని, అవసరమైన ప్రతిసారీ మనస్తత్వ శాస్త్రవేత్తలను సంప్రదించి, వారినుంచి విశ్లేషణాత్మకమైన సారాంశాన్ని గ్రహించి వ్యాసరచనకు ఉపయోగించడం జరిగింది. ఈ సిద్దాంత వ్యాసం ఐదు అధ్యాయాలుగా విభజించబడింది.
ఒకటవ అధ్యాయం - సామెత. సమాలోకనం, ప్రవేశిక, సామెత- జాతీయం, నానుడి, మానవుడు- మానసిక పరివర్తన, సామెతలు- భిన్న నిర్వచనాలు, సామెతలు- వింగడింపు.
రెండవ అధ్యాయం - సామెతలు- కుటుంబ జీవనం, మానవుడు- మనస్తత్వం, తల్లిదండ్రులు, పెళ్ళి, అత్తాకోడళ్ళు, భార్యాభర్తలు, సంసారం, సంతానం, బంధుత్వం.
మూడవ అధ్యాయం - సామెతలు- సంఘ జీవనం, సామాజిక జీవనం, కులాలు- వృత్తులు, మతాలు, అలవాట్లు, ఆచారాలు- విశ్వాసాలు, అపోహలు.
నాల్గవ అధ్యాయం - సామెతలు- వివిధ మనస్తత్వాలు, ఆలోచనా విధానం, అరిషడ్వర్గం, మనస్తత్వాలు, సాధింపులు- వేధింపులు, సాధింపులు- పిల్లలు.
ఐదవ అధ్యాయం - ఉపసంహారం.

శరీరం ఆరోగ్యంగా వుంటే మనసు ఆరోగ్యంగా వుంటుంది. మనసు ఆరోగ్యంగా వుంటే శరీరం ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది. మన ఆంతర్యాన్ని బట్టే ఆలోచనలు వుంటాయి. ఆలోచనలను అనుసరించి ఆచరణ వుంటుంది. సాధారణంగా అణచబడ్డ కోరికలు, యిష్టాలు, భావాలు, అభిప్రాయాలు ముఖ్యంగా శారీరక దాడికి, హింసకి సంబంధించినవి, అసంతృప్తి మొదలైనవి మనసు లోపలిపొరల్లో గుప్తంగా వుండిపోతాయి. ఇలా అణచబడ్డ భావాలు తీవ్రత ఆయావ్యక్తుల ప్రవర్తనని, ఆలోచనలని నియంత్రిస్తుంది. పై విభజనలోని అంశాలను పరిశీలిస్తే ఈ విషయాలు అవగతమౌతాయి.

Preview download free pdf of this Telugu book is available at Telugu Samethalu Manava Manastatva Vishleshana
Comment(s) ...

This is a project work record. not worth buying for normal reading.