-
-
తెలుగు సామెతలు - నవరత్న బుక్‌హౌస్
Telugu Sametalu Navaratna BookHouse
Author: Dr. Velaga Venkatappaiah
Publisher: Navaratna Book House
Pages: 512Language: Telugu
తెలుగు భాషతోనే తెలుగు సామెతలు పుట్టాయి. అంతటి ప్రాచీనత వీటికుంది. తెలుగు సాహిత్యంతో బాటు ఇవీ ఎదిగాయి. సాహిత్యంలోన్ అన్ని ప్రక్రియలలో పాలలో పంచదారలా కలిసిపోయి తెలుగు వాఙ్మయానికి సొంపు, ఇంపును చేకూర్చాయి. ముఖ్యంగా నిసర్గమనోహరమైన మన గ్రామీణ వాతావరణం, గ్రామీణుల అలవాట్లు, వావి వరసలు, సాధక భాధకాలు, ఇక్కట్లు సామెతలలో నిండుగా ఉంటాయి.
కవిత్రయ భారతంలోనూ, పాల్కురుకి సోమన, నాచన సోమన, అన్నమయ్య, తాళ్ళపాక తిరువెంగళనాధుడు, వేమన తదితరుల రచనలలో సామెతలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఆధునిక సాహిత్యంలోనూ కవి పండితులు సామెతలకు పెద్ద పీట వేశారు. ఆధునిక శతకాలలో సామెతలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు.
* * *
సామెతలు జన జీవన నాడిని ప్రతిబింబిస్తాయి.
భాష, భావనలో వాడీ, వేడీ, చమత్కారం, సందేశం సద్భావనతో ఇమిడి ఉంటాయి.
సామెతలు తెలుగు భాషామతల్లి అందించే మనోజ్ఞ మందారాలు, సుభాషితాలు, సూక్తులు.
విదేశీ ఉద్యోగి కెప్టెన్ కార్ సేకరించి, 1868లో ముద్రించిన తెలుగు సామి(మె)తల చేర్పు ఈ కూర్పుకు ఒక ప్రత్యేకాలంకారం.
తెలుగు వారి జన జీవనంలో సామెతలు అవిభాజ్యం. సమెతలు లేనిదే జీవితం లేదు. ఆనందం లేదు.
తెలుగు సామెతలు మన భాషలో ఒక అమృత భాండం.
- ప్రచురణ కర్తలు
- ₹72
- ₹432
- ₹432
- ₹432
- ₹72
- ₹72
- ₹540
- ₹108
- ₹72
- ₹432
- ₹540
- ₹810
rent option please