-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
తెలుగు ప్రహేళికలు (free)
Telugu Prahelikalu - free
Author: Kandi Shankaraiah
Publisher: Sankarabharanam Prachuranalu
Pages: 50Language: Telugu
శ్రీ కంది శంకరయ్య గారు నిర్వహించుచున్న 'శంకరాభరణము' బ్లాగునందు ఈ ప్రహేళికలను తనకు తానుగా రచించి పాఠకులలో ఉత్సాహ ముప్పొంగునట్లు సమాధానములను చెప్పునట్లు చేయు ప్రయత్నము అభినందనీయము.
'నలు మొగములవాఁడు' అని ప్రారంభమయే రెండవ ప్రహేళికలో కవి పాఠకులకు శ్రీరామచంద్రుఁడు శుభములను కూర్చుగాక అని శుభము నాకాంక్షించిరి. ఇక్కడ సమాధానమునకై పాఠకులను వారు ఆలోచింపఁ జేసిన విధాన మమోఘోఘము. బ్రహ్మయొక్క ఇల్లాలయిన సరస్వతికి అత్త అయిన లక్ష్మి యొక్క కొడుకయిన మన్మధుని యొక్క శత్రువైన శివుని యొక్క భార్య అయిన పార్వతీదేవికి తండ్రి అయిన పర్వతరాజు శత్రువయిన ఇంద్రుని కొడుకయిన అర్జునుని బావ అయిన కృష్ణుని శత్రువయిన జరాసంధుని చంపినవాడయిన భీముని తండ్రి అయిన వాయుదేవుని కుమారుఁడయిన ఆంజనేయుని యొక్క ప్రభువు మిమ్ములను రక్షించు గాక అనగా మీకు శ్రీరామరక్ష అని శుభారంభం చేసి తన ఔన్నత్యాన్ని కనబరచుకొన్న కవి శంకరార్యులు.
ఈ విధముగా ప్రతి ప్రహేళిక వీరి ప్రశ్నవేసే నిపుణత సమాధానము రాబట్టు చాకచక్యముతో కూడిన సూచనలు వీరి సాహితీ ప్రతిభకు అద్దము పట్టుచున్నవనవచ్చును.
- చింతా రామకృష్ణారావు
పద్యం మనిషికి క్రమపద్ధతిలో జ్ఞానాన్ని అందిస్తుందన్న అచంచల విశ్వాసంతో నిత్య పద్యరచనా సాధకులైన శ్రీ కంది శంకరయ్య గారు సంస్కృతంలో విస్తృతంగా ఉన్న యీ ప్రహేళికా ప్రయోజనాన్ని తెలుగు పద్యాల్లోనూ అత్యంత సులభంగా, సౌలభ్యకరంగా అందించవచ్చునని 'తెలుగు ప్రహేళికలు' ద్వారా నిరూపించారు.
- గన్నమరాజు గిరిజామనోహర బాబు

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE