• Telugu Kathanam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు కధనం

    Telugu Kathanam

    Author:

    Pages: 384
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథనం కథానికకు ప్రాణం. అది కళాత్మకంగా సాగాలి. చెప్పదల్చుకున్న విషయం ఎంత నిజమైనా శిల్పం లోపిస్తే కథనం కుంటుపడుతుంది. కథానికకు కళ చెడుతుంది. అనేకమంది రచయితలు శిల్పాన్ని పోగొట్టుకునేది జీవితంలో తాము గమనించిన కొన్ని విషయాల్ని తీసుకుని వాటికి బలాత్కారంగా తమ ప్రయోజనాన్ని జోడించమే!

'కథ' ముడివజ్రం. మూలధనం లాంటిది. ప్రక్రియగా పసని పెంచే ధనం-కథనం. ఎంత గొప్ప జరిగిన సంఘటనకైనా కళాత్మక రూపాన్నిచ్చే ఇంధనం!

ఈ సంకలనంలో పదిమంది తమ కథానికల్ని-ఒక్కొక్కళ్ళవి అయిదేసి చొప్పున పొందుపరిచారు. ఒక్కొక్కళ్ళ కథానికలకు ఒక్కో సీనియర్‌ రచయిత ముందుమాటని వేరు వేరుగా రాశారు. మరో విషయంకూడా గమనించాలి. ఈ సంకలనంలో అయిదుగురు రచయితల, అయిదుగురు రచయిత్రుల కథానికలున్నాయి. అందుకని ఈ సంకలనంలోని కథానికల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరేం చెప్పాలి? అని ఆలోచించినప్పుడు ప్రత్యేకంగా ప్రక్రియ గురించి చెప్పాల్సిన అవసరముందనిపించింది. సంకలనానికి, సంపుటికి మధ్య తేడా ఎలాఉందో కథకు, కథానికకు మధ్య వున్న తేడాని చెప్పాలనిపించింది.

సంకలనమంటే భిన్న రచయితల రచనల సమాహారం. సంపుటి అంటే ఒకే రచయిత లేక రచయిత్రి రచనల సమాహారం. కథంటే వస్తువు. కథానికంటే ప్రక్రియ. అన్ని ప్రక్రియలలోనూ కథ... వస్తుఉంటుంది.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Telugu Kathanam