-
-
తెలుగు జానపద కళ
Telugu Janapada Kala
Author: Tata Ramesh Babu
Pages: 272Language: Telugu
మానవుడు ఒక అద్భుతమైతే, జానపద కళ మహాద్భుతం. ప్రపంచ దేశాలలలో అనేక జాతులు అనేకానేక జానపద కళల్ని సమకూర్చుకుని ప్రదర్శించుకుంటూ, వాటి అవసరం తీరగానే రూపం మార్చుకుని ముందుకు సాగాయి. అలా అంతరించిపోయిన జానపద కళలు ఎన్నెన్నో! ఈ కళా ప్రయాణంలో వేటకళ, వీరకళ, యుద్ధకళ మొదలుకొని ఎన్ని జానపద కళలు! ఎన్ని జానపద గీతాలు ! ఎన్ని జానపద నృత్యాలు! ఎన్ని పగటివేష కళలు! అంతరాంతరాల్లో ఉబుకుతున్న ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని జీవితంతో ముడిపడ్డ కష్టం, సుఖం, బాధ, సంతోషాలని లయగా, రీతిగా మార్చుకుని జానపద కళలుగా మలచుకొని శాంతిని పొందాడు మానవుడు.
3000 సంవత్సరాల తెలుగువారి చరిత్రలో జాతి జీవన గమనాన్ని, భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను తెలుగు జానపద కళలు నిలబెట్టాయి.
ప్రజలమధ్య పుట్టి, పెరిగి స్వయంభువులుగా ఏర్పడిన జానపద కళలు ఎంతో విలువైనవి. శాస్త్రీయమైన కళారూపాలకు జానపద కళలు పునాదులు వేశాయి.
ఏ కారణం చేతో నేడు ఆదరణ తగ్గి కనుమరుగవుతున్న నేపథ్యంలో జానపద కళల వైశిష్ట్యాన్ని, అంతరార్థాన్ని, నేటి పరిస్థితిని అవలోకించటమే ఉద్దేశంగా "జానపద కళ" అనే పుస్తకాన్ని రచించాను.
- తాతా రమేశ్‌బాబు
