-
-
తెలుగు సినిమాపాట చరిత్ర
Telugu Cinema Pata Charitra
Author: Dr. Paidipala
Pages: 408Language: Telugu
Description
'సినిమాపాట పుట్టుపూర్వోత్తరాల గురించి పెద్ద రీసెర్చి ఏమిటి? అదంత కష్టమైన విషయమా? అసలు సినిమాపాట రాయడం, పాడడం పెద్ద విద్యా?' అనే విద్యాధికులకు నేను ఈ పుస్తకం గురించి ఏం చెప్పినా సహించదు. ఎందుకంటే నేను ఆ 'లొల్లాయి పాటలు' పాడి పొట్టపోసుకునే వాణ్ణి గనుక.
క్లుప్తంగా చెప్పాలంటే నా వృత్తి జీవితంలో నేను సగర్వంగా చెప్పుకునేట్టు చేసిన కొన్ని పనులలో ఈ పుస్తకానికి కొద్దో గొప్పో సహకరించడమనేది అతి ముఖ్యమైనది. 'మామూలు భావుణ్ణి' (ముళ్ళపూడి వారికి ధన్యవాదాలు) నాకు మాత్రమే కాదు, మా సినిమాకు సంబంధించిన మహానుభావులకూ తెలియని, తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అక్కర వున్న ప్రతి సినిమా ప్రేక్షకుడు చదవాల్సిన పుస్తకం అంటే అతిశయోక్తి కాదు.
సినిమా బ్రతికినంత కాలం, వెలకట్టలేని ఈ పుస్తకం, ఈ రచయిత శ్రమా - జీవిస్తాయి.
- యస్.పి. బాలసుబ్రహ్మణ్యం
Preview download free pdf of this Telugu book is available at Telugu Cinema Pata Charitra
Login to add a comment
Subscribe to latest comments
