-
-
తెలుగు సినీగేయకవుల చరిత్ర
Telugu Cine Geya Kavula Charitra
Author: Dr. Paidipala
Publisher: Sneha Prachuranalu
Pages: 366Language: Telugu
ఈ 'తెలుగు సినీగేయకవుల చరిత్ర' - ఎనభయ్యేళ్ల తెలుగు సినీగేయ వికాసాన్ని ప్రభావితం చేసిన 12 మంది మార్గ నిర్దేశక కవులతోపాటు కొందరు ఇతర కవుల ప్రత్యేకతల్ని కూడా చర్చించిన గ్రంథం.
ఎనిమిది దశాబ్దాల కాలంలో తెలుగు సినిమాపాటలో వచ్చిన ఎన్నో మార్పులకు ఇతర కారణాలతోపాటు దాని రూపశిల్పులైన కవుల పాత్ర కీలకమైంది. ఇప్పటికే ఆనవాళ్ళు చెరిగిపోతూ వక్రీకరణకు గురవుతున్న సినీకవులకు సంబంధించిన వాస్తవాలను సేకరించి ఆ చరిత్రను అక్షరబద్ధం చేస్తే - అది వర్తమానానికి భవిష్యత్తుకు బహుధా వుపయోగయతుందని ఈ యత్నం.
అవకాశమున్న చోట్ల తెలుగు సాహిత్యచరిత్రతో పోలుస్తూ రాసిన ఈ 'సినీగేయ కవులచరిత్ర' లో యిప్పటి వరకు 12 మందిని మాత్రమే మార్గనిర్దేశకులుగా గుర్తించడం, మరో 65 మంది కవుల గురించి అంతో యింతో రాయడం, మరికొంతమంది గురించి ఏమీ రాయకుండా జాబితాకే పరిమితం చెయ్యడం, కొందరి పాట ల్లో లోటుపాట్లను ప్రస్తావించడం.. వివాదాలకూ విమర్శలకూ అభియోగాలకూ ఆస్కారమున్న అంశాలు. నడుస్తున్న చరిత్రను రాసేటప్పుడు అందర్నీ సంతృప్తిపరచడం అసాధ్యం. ఈ చరిత్రలో ఎవరికెంత చోటివ్వాలో అనే విషయం గురించి ఈ రంగానికి సంబంధించిన పలువురి ప్రముఖులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే అక్షరరూమివ్వడం, అచ్చుకు ముందుగా అయిదారుగురు సినీ సంగీతసాహిత్య పరిజ్ఞాతల చేత, కొందరు సంబంధిత కవులచేత దీనిని చదివించం, అన్నిటికీ మించి చిత్తశుద్ధితో ఆచితూచి నిష్కర్షగా ఈ రచన చేస్తున్నానే ఆత్మవిశ్వాసం - ఈ సాహసానికి మూలం, బలం ! పుస్తకం నిడివిని, చదివించే గుణాన్ని దృషిలో పెట్టుకొని ప్రత్యేకతలు లేని కొందరు కవుల్ని విస్మరించడం - వారి అనర్హత కాదు; అవసరం లేక! దాన్ని అవమానంగా అపార్థం చేయకోవద్దని విన్నపం. అమూల్యమైన విషయాన్ని ఆసక్తికరంగా చదివించడానికి చేసిన ప్రయత్నం ఈ పుస్తక ప్రణాళికలో ప్రధానమైంది.
- పైడిపాల
