-
-
తెలుగు భాష - వ్యాకరణం
Telugu Bhaasha Vyaakaranam
Author: Dr. Addanki Srinivas
Publisher: Dr. Addanki Srinivas
Pages: 166Language: Telugu
ఈ గ్రంథం విద్యారంగ ప్రాముఖ్యాన్ని, దానికవసరమైన అధ్యయన పరిశోధనలను గురించిన చర్చతో ప్రారంభమయింది. విద్యారంగం తొలినాళ్ళలో లాగా కాకుండా, నేడు వ్యవస్థీకృతమైన రంగం. అటువంటి రంగానికి భాషా స్థితిగతులే మూలం. దాని అభివృద్ధికి పరిశోధనాత్మకమైన నిరంతరాణ్వేషణ జరగాలి. ఈ కారణంగా తెలుగు భాషకు చెందిన ప్రాచీన, అర్వాచీన దృక్పథాలను పరిశీలించి, పరామర్శించ వలసి వచ్చింది. సదరు ప్రయత్నానికి అనురూపమే ఈ "తెలుగు భాష - వ్యాకరణం".
ప్రాచీన కాలం మొదలు అర్వాచీన (ఆధునిక) కాలం వరకు జరిగిన తెలుగు భాషా వికాసానికి తొలి దశలో వ్యాకరణ రచనలు, లక్షణ గ్రంథాలు, ఆ తరువాత నిఘంటు నిర్మాణం తోడ్పడ్డాయి. వాటి తోడ్పాటుతో సాహిత్యం విస్తృతమయింది. అది భాషా స్థితికి పట్టుగొమ్మయింది. "Language is the means to self expression and Literature is the end to the same" అన్నది సకల భాషా సాహిత్యాలకు అన్వయించే సత్యం - ఇది ప్రాచీన దృక్పథం.
నేటి తెలుగు వ్యవహారానికి చెందిన అన్యదేశ్య పదాల వ్యాప్తి, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్త, చేపట్టవలసిన చర్యలు, మహానిఘంటు నిర్మాణావశ్యకత మొదలైన అంశాల ప్రదర్శన - ఇది అర్చాచీన దృక్పథం.
"వ్యాక్రియంతే శబ్దాః అనేన ఇతి వ్యాకరణమ్" అనే అవయవిని బట్టి ఈ గ్రంథాన్ని "తెలుగు భాష - వ్యాకరణం"గా పేర్కొనవలసి వచ్చింది.
ఈ పుస్తకాన్ని "తెలుగు భాష - వ్యాకరణం" అనడం కంటే "తెలుగు భాష - వ్యాకరణ చరిత్ర" అనడం సరేమో. పద - వ్యాకరణ ఆవిర్భావం మీద ఆశక్తి ఉన్న నాలాంటి వారికి ఈ పుస్తకం ఒక నిధి వంటిది. కానీ ఆంగ్ల మాధ్యమంలో చదువుకొని, తెలుగు పద సంపద మీద పట్టు లేని నాలాంటి వారికి ఈ పుస్తకం చదవడానికి పక్కన నిఘంటువు తప్పనిసరి. నేను andhrabharati.com సహాయంతో ఈ పుస్తకం చదువుతున్నాను.