-
-
తెలుగు అక్షర బోధిని
Telugu Akshara Bodhini
Author: Sadhanandam
Publisher: Self Published on Kinige
Pages: 78Language: Telugu
పాశ్చాత్య ధోరణిలో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఇంగ్లీషు విద్య అవసరమే కాని మన మాతృభాషను మరువరాదు. తెలుగును నేర్చుకునే దశలో సరైన శిక్షణ ఇవ్వకపోవడం లేదా క్లుప్తంగా విద్యార్థులకు వివరించి చెప్పకపోవడం వలన పిల్లల్లో తెలుగు భాష కష్టమనే భావన ఉంది.
సెకండ్ లాంగ్వేజ్ విద్యార్థులకు మరియు ఇతర మాతృభాష పిల్లలకు తెలుగు రాయడం, చదవడం కష్టమనిపిస్తుంది. ఈ సమస్యని గుర్తించిన నేను మొదటగా విద్యార్థులకు తెలుగు అక్షరాలు వర్ణమాల నేర్పించి వాటిని అనేక సార్లు వ్రాయిస్తూ, చదివించినట్లయితే, తెలుగు భాష సులభమవుతుందని విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ పుస్తకం వ్రాయడం జరిగింది.
తల్లిదంద్రులు, ఇతరులు, దగ్గరుండి ఈ పుస్తకమును పిల్లల చేత వ్రాయిస్తూ చదివిస్తే మంచి ఫలితం ఉంటుంది. తెలుగు భాషను మన తల్లిదండ్రుల్లా ప్రేమిస్తూ, భాషను నేర్చుకుంటే సులభతరం అవుతుంది. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులతో పాటు ఎవరైనా తెలుగు భాష నేర్చుకోవాలనే అభిలాష ఉన్నవారు ఈ పుస్తకంలో సూచించిన విధంగా, వ్రాసి చదివితే తెలుగుభాష లిపి తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను.
- ములుక సదానందం
