-
-
తెలుగింటికొచ్చిన ద్రౌపది
Telugintikocchina Droupadi
Author: Dr. M.V. Ramana Reddy
Pages: 168Language: Telugu
సంస్కృత మూలాన్ని మించి ఆంధ్రమహాభారతం గొప్ప పేరు తెచ్చుకోడానికి కారణం కవిత్రయం చేసిన మార్పులూ చేర్పులూ మాత్రమేగాక, వారు అనువాదంలో పాటించిన పద్ధతులూ, మెలకువలూ కూడా. కవిత్రయ భారతం చదువుతున్నప్పుడు అది ఎక్కడో ఉత్తరదేశంలో జరిగినట్టు తోచదు. తెలుగునట మన మధ్యనే జరిగిన అనుభూతి కలుగుతుంది. కవిత్రయం, మరీ ముఖ్యంగా తిక్కన, పాత్రలను శిల్పించిన తీరూ, పాత్రల మధ్య నడచిన సంభాషణలూ అలాంటి భావన కలిగిస్తున్నాయి. వందల సంవత్సరాలుగా ఆంధ్రమహాభారతాన్ని చదువుతున్న తరాలు మారుతున్నాయోమేగాని తెలుగు ప్రజలకు దీనిని చదివిన అనుభూతి నాటికీ నేటికీ ఒక్కటిగానే ఉంది. అందువల్లనే సాహిత్య పరిశోధనలకూ, మహాభారతాభిమానులకు ఈ విశేషం పరిశీలనాయోగ్యమైనది. మహాభారతంలో కీలకపాత్ర ద్రౌపదే కనుక, ఆమెను తెలుగింటి ఆడపడుచుగా దర్శించి, తన అనుభూతిని ఈ గ్రంథంలో మనతో పంచుకుంటున్నారు డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి గారు. నిజమే. వివిధ సన్నివేశాలలో ద్రౌపది స్పందించిన విధానం, వ్యవహరించిన తీరు, మాట్లాడిన పద్ధతి తెలుగింటి ఇల్లాలినే స్ఫురణకు తెస్తుంది "తెలుగింటికొచ్చిన ద్రౌపది" చదువుతున్నప్పుడు.
రమణారెడ్డిగారు తెలుగింటి ఆడపడుచుగా ద్రౌపదిని తాను గుర్తించడమే గాక మనందరి చేత గుర్తింపజేయడం లక్ష్యంగా ఈ రచన చేసారు. గుర్తింపు ఒక్కటే కాదు, తెలుగింట ద్రౌపదిని పెద్దపీటమీద కూర్చోబెట్టి ఆమె అంతస్తుకు తగిన విధంగా తమ గ్రంథంతో సత్కరించారు. మహాభారత మహారాజ్ఞిగా పాంచాలికి 'పట్టాభిషేకం' చేసారు.
- పొత్తూరి వెంకటేశ్వరరావు
ద్రౌపది పాత్రకు కాకుండా మిగతా భారతాన్ని వదిలెయ్యవలసింది, లేదా ఇంకా క్లుప్తీకరించాల్సింది.
తిక్కన భారతంలోని తెలుగుదనాన్ని, తియ్యదనాన్ని రచయిత చక్కగా వివరించాడు.
ఎఱ్ఱన ఉభయకవిమిత్రుడు ఎందుకో రచయత సోదాహరణంగా రచయిత చక్కగా వివరించాడు.
నన్నయ్య శైలిని బాగా పట్టుకున్నాడు రచయిత
యుద్ధం తరువాత ద్రౌపది పాత్రను ఇంకా కొంచెం పెంచవలసింది. కుమారులు కోల్పోయినప్పుడు ఆ తరువాత ఆమె ఎలా ప్రవర్తించిందో వివరించవలసింది.
సంస్కృత భారతం నుండి ఇంకొన్ని పద్యాలను ఉదహరించవలసింది
ముఖ్యంగా తిక్కన భారతంలోని తెలుగుదనాన్ని రుచిచూడటానికి ఈ పుస్తకం చదవాలి.