-
-
తెలుగే గొప్ప భాష - కానీ కనుమరుగౌతున్నది
Teluge Goppa Bhasha Kani Kanumarugoutunnadi
Author: Parupalli Kodanda Ramaiah
Publisher: Vanguri Foundation of America
Pages: 112Language: Telugu
తెలుగు నుడిలోని గమ్మత్తులూ, ధ్వని-వర్ణ-పద-వాక్య-పదార్థపదాంతరార్థ- అభిధ-లక్షణ-వ్యంజన-నుడికారం-కాకువు ఇలాంటి తమాషాలూ ఎన్నో ఉన్నాయి. ఎన్నని చెప్పను! తెలుగులో ఉన్న సొగసులన్నీ రాసులుగా పోసి, దానికి అక్కడక్కడా శాస్త్రీయతను అద్ది మనముందు తుడిచిన అద్దంలా నిలబెట్టారు.
- డా. అద్దంకి శ్రీనివాస్
మనం సంస్కృత దాస్యం వదిలించుకోవాలి కానీ సంస్కృత పదాలను వదిలి వేయరాదు. తెలుగు పదాలు లేనప్పుడు సంస్కృత భాష పదాలను వాడుకోవచ్చు కానీ, వాటితోపాటు ఆ భాష వ్యాకరణాన్ని దిగుమతి చేసుకోవడం గొప్ప నేరం. మీ పొత్తం చిన్నదైనా అందరూ చదువతగినది, చదువవలసినది! అమ్మ నుడి సమస్యలన్నీ ఒకచోట చేర్చి వాటి పరిష్కారానికి సూచనలంద చేశారు. మీ శ్రమ వృథా కాదు.
- చెన్నూరు ఆంజనేయ రెడ్డి
తెలుగు భాషోద్యమంలో పాల్గొని పొరుగు రాష్ట్రాల నేల వాసులు కూడా తల్లి నుడిని కాపాడుకొనే అవకాశం ఉంది. మనం ఇప్పుడు వారితో చేతులు కలపవలసి ఉంది. ఇలాంటి అనేక ఆలోచనలకు పాదు ఈ పొత్తం.
- జయధీర్ తిరుమలరావు
పారుపల్లి కోదండ రామయ్య గారి ఈ “తెలుగే గొప్ప భాష - కాని కనుమరుగౌతున్నది" అనే పుస్తకం ఆయా నాయకుల కంటపడితే, వారు చదవగలిగితే అప్పుడు ఆ వేడికి సీసం కాస్త కరిగి విషయం ఎంత ప్రగాఢమైనదో, మన ఆస్తిత్వవినాశనానికి ఎంత దగ్గరలో ఉన్నామో అర్ధం అవుతుంది.
- వంగూరి చిట్టెన్ రాజు
