-
-
తెలంగాణ వైభవ గీతములు
Telangana Vaibhava Geetamulu
Author: Sabbani Laxminarayana
Publisher: Self Published on Kinige
Pages: 43Language: Telugu
సబ్బని కలములోంచి తెలంగాణ వైభవ గీతములు .
సబ్బని తెలంగాణ ఉద్యమ కాలము 2001 -2014 వరకు 14 ఏళ్ళ వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కోరి 10 పుస్తకాలు ప్రచురించారు. అవి వచన కవిత, వ్యాసం , పాట, దీర్ఘ కవిత , చిరు కవితా రూపాలైన నానీ, నానో, రెక్కలు, హైకూ ప్రక్రియల్లొ తెలంగాణ ఉద్యమములో పాట ప్రధాన భూమిక పోషించింది, 2010 సంవత్సరములో సబ్బని తెలంగాణ చరిత్ర నేపథ్యములో తెలంగాణాపై కొంత అధ్యయనం చేసి " చారిత్రిక తెలంగాణ " అనే గేయ కవితను రాసి ప్రచురించారు . తెలంగాణ ప్రజల సమిష్టి ఉద్యమ ఫలితంగా జూన్ 2వ తేదీన తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు అయింది. ఈ సందర్భంగా సబ్బని మరో మారు తెలంగాణా చరిత్ర సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసి తెలంగాణా వైభవ గీతములు రాసి వాటిని రాగ యుక్తంగా రికార్డ్ చేయించారు. ఆ పాటలు 1) జయహో తెలంగాణ 2) తెలంగాణ పిలిచే 3) జయహో తెలంగాణ మరియు తెలంగాణ వైభవం పార్ట్ -1, తెలంగాణ వైభవం పార్ట్ -2, తెలంగాణ వైభవం పార్ట్ -3. ఈ పాటల్లో ప్రాచీన కాలము నుండి నవీన కాలము వరకు తెలంగాణ చరిత్ర , సంస్కృతి నిక్షిప్తమై ఉన్నది.
ఈ పాటలకు సంగీతం సమకూర్చి గాత్రం కూడా ఇచ్చిన కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన సంగనబట్ల నరేందర్ శర్మ మరియు కరీంనగర్ గాయనీమణి లలితా ప్రసాద్ ధన్యులు. శాస్త్రీయతను మేళవించుకొని వీనుల విందుగా ఉన్న ఈ పాటలు శ్రోతల మనసులను రంజింప చేస్తాయి . తెలంగాణపై అధ్యయనం చేసే విద్యార్థులు తప్పకుండా చదువ వలసిన పుస్తకం .

- ₹14.4
- ₹72
- ₹60
- ₹60
- ₹60
- ₹36