-
-
తెలంగాణ కావ్యం
Telangana Kaavyam
Author: Velapati Rama Reddy
Pages: 105Language: Telugu
కాలం ఇయ్యాల ముందుకు తెచ్చిన సందర్భం తెలంగాణ. స్థానిక ప్రజల జీవనావసరం తెలంగాణ. అడవిలో పొద్దుగూకినోని తొక్కులాట తెలంగాణ. తెలంగాణ చైతన్యం క్రమక్రమంగా అన్ని రంగాలల్లకు విస్తరిస్తున్నది. తెలుగు సాహిత్యంలో తెలంగాణ ప్రకంపనాలు బలంగా ఆవరిస్తున్న సన్నివేశాన్ని ఇప్పుడు చూడచ్చు. సరిగ్గ ఈ సందర్భాన్ని కవిత్వంలోకి వొంపుతున్న కవి వెలపాటి రామరెడ్డి. కావ్యం పేరు తెలంగాణ.
తెలంగాణ కవుల్లో రామరెడ్డిది భిన్నమైన శైలి. చాలామంది కవులు పాటనో, వచన కవితనో వాహిక చేసుకుంటే రామరెడ్డి పద్యాన్ని ఎంచుకున్నాడు. తన అనంత సంక్షోభకు సంవేదనకు పద్యాన్ని అనుగుణంగా మలుచుకోవడంలో విశేష ప్రతిభను కనపర్చిండు. చక్కని తెలుగు పలుకుబడుతలో పద్యాన్ని సుసంపన్నం చేసిండు.
సుదీర్ఘ సంవేదనను ప్రతిఫలించిన పగిలిన అద్దం ఈ కావ్యం. చలువ పందిళ్ళ వరుసల్లో మొలిచిన సర్కారు తుమ్మల నడుమ నుంచి మంద్రస్వరంతో వినిపించే మంద్రధ్వని 'తెలంగాణ' .
- నందిని సిధారెడ్డి
