-
-
తెలంగాణ ఇంటివంటలు - వెజ్
Telangana Intivantalu Veg
Author: Jyothi Valaboju
Publisher: J.V.Publications
Pages: 296Language: Telugu
వంటా? ఎందుకొచ్చిన తంట? అనే రోజులు కావివి. స్వతహాగా పాకశాస్త్రం పట్ల అభిరుచే కాక, తగినంత అవగాహన కూడా జ్యోతి కినిగెలో ఆన్లైన్లో స్నాక్స్ పేరిట ఈ-బుక్ ప్రచురించారు. ఈ రోజు ఆదివారం, అందరూ ఇంట్లో వుంటారు. ఏం వండాలి? అని ఆలోచించనక్కరలేకుండా, ఇదిగో హితవుగా ఇది చేయండి అని ఆంధ్రభూమి ఆదివారం దినపత్రికలో రుచి శీర్శికన మీకు తన చేయూతనిస్తారు.
షడ్రుచులు సిరీస్లో మన ముందుకు వస్తున్న ప్రథమ ముద్రణ ఈ పుస్తకం. తను పుట్టి పెరిగిన తెలంగాణ ప్రాంతపు శాఖాహార రుచులను ఎంతో శోధన చేసి పుస్తక రూపంగా అందిస్తున్నారు.
- సి. ఉమాదేవి
* * *
జ్యోతికి వంట చెయ్యడం ఇష్టం. ఆ ఇష్టంతో తొల్లింట తెరిచిన వంటల బ్లాగు "షడ్రుచులు" అంటే మరీ ఇష్టం. తన తెలంగాణా మూలాలంటే మరీ మరీ ఇష్టం. తెలంగాణా మట్టిసారాన్ని నరనరాల్లో నింపుకున్న తరతరాల కుటుంబాలకి వారసులైనందుకు, తన అమ్మమ్మ, బామ్మల నుండి, అత్తలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, తన తోటి సాహసగత్తెల వరకూ ఎందరో తెలంగాణా మహిళలతో మాట్లాడి, సాంప్రదాయకమైన వంటకాలను నేర్చుకుని, తాను స్వయంగా వండి, ఇప్పుడు ఆ విశేషాలన్నిటినీ ఈ పుస్తకరూపంగా మనకి అందిస్తున్నారు.
- ఎస్. నారాయణస్వామి
