-
-
తెలంగాణ హైకూలు
Telangana Haikulu
Author: Sabbani Laxminarayana
Publisher: Self Published on Kinige
Pages: 36Language: Telugu
తెలంగాణ వేదన ప్రతిఫలించిన సబ్బని ‘హైకూలు’
తెలంగాణ పట్ల సబ్బని నిర్మలమైన నిజాయితీని ఈ ‘ తెలంగాణ హైకూలు ‘ ప్రతిఫలిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఆరు దశాబ్దాలుగా నడుస్తున్న తెలంగాణ ఉద్యమములో భాగంగా సబ్బని సంధించిన హైకూలు ఇవి. ఇక్కడ కావ్య వస్తువు తెలంగాణ. ఈ
సంపుటిలో 108 హైకూలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రములో అన్నీ రంగాలలో తెలంగాణ వెనుకబడి పోయి ప్రత్యేక రాష్ట్రము కావాలని తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తున్న తరుణములో సులభమైన మూడు లైన్ల చిన్ని కవిత రూపం హైకూలో తెలంగాణ స్వరూపాన్ని కష్టాన్ని, కన్నీటిని,
వాస్తవ పరిస్థితులను, జరుగుతున్న మోసాలను, కాల యాపనను, దాటవేతను, పాలకుల వివక్షతను, అవకాశవాదాన్ని, మోసపూరిత వాగ్దానాలను, ఓటు బ్యాంకు రాజకీయాలను, ఊరూరా వ్యాపించిన ఉద్యమ చైతన్యాన్ని ఈ హైకూలు ప్రతిబింభిస్తున్నాయి. ఎన్ని ఆటంకాలు
ఎదురైనా , ఎన్ని నష్టాలు వచ్చినా తెలంగాణ నిలుస్తుస్తుంది, గెలుస్తుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సబ్బని ఈ ‘ తెలంగాణ హైకూలు ‘ అనే చిన్ని పుస్తకములో.
మచ్చుకు కొన్ని హైకూలు :
* * *
ఆర్తితో
తెలంగాణ బతుకు
ఎప్పుడూ తెలవారుతుందో
కాలాన్ని
గుర్తు చేస్తూ
తెలంగాణ తొవ్వ.
కాలం సిగాలో
తెలంగాణ పువ్వు
పూస్తుంది.
నాయకులు
సేద దీరుతుండ్రు
పార్టీ గడపల్లో
ఒకే పార్టీ
కొందరు అటు
కొందరు ఇటు.
తెలంగాణ
బాధ
ఎద్దు పుండు.
తెలంగాణ
తెగిపోయిన వీణ
సవరించాలి
గాలి మాటలు
కొట్టుక పోతాయి
సత్యం గెలుస్తుంది.
అల్లంత దూరంలో
తెలంగాణ
తెలంగాణ ఒక సత్యం.

- ₹14.4
- ₹72
- ₹60
- ₹60
- ₹36
- ₹60