-
-
తెలంగాణా చౌక్
Telangana Chowk
Author: Karra Yella Reddy
Language: Telugu
సంపాదకులు: కర్ర ఎల్లారెడ్డి, డా. బి.వి.ఎన్. స్వామి
ఇంటర్చదివే పిల్లవాడు మొదలు, లబ్ధ ప్రతిష్టులైన 19 మంది కథకుల కథా లాంఛర్లతో తెలంగాణా చౌక్దూసుకు వస్తున్నది. ఇందులో 1952 నుండి 2011 వరకు రాసిన కథలున్నాయి. ఈ కథలలో ముద్రిత, అముద్రిత కథలు ఉండం విశేషం.
'' తెలంగాణా చౌక్'' లో మంచి కథలు ఎక్కువగా ఉన్నాయని చెప్పగలం. శైలీ శిల్పం ఉన్న కథలూ ఉన్నాయి. అవి లేకున్నా వస్తు ప్రాధాన్యంతో, నిబద్ధతతో రాసిన కథలూ ఉన్నాయి. ఈ కథల సంకలనకర్తలనో, ప్రచురణకర్తలనో మెప్పించం కోసం రాయబడలేదు. రాసిన వాటిని సేకరించం జరిగిందని మాత్రం గుర్తుంచుకోవాలి. ఎవరి మెహర్బానీ కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం రాయబడని ఈ కథల్లో ఒక ప్రాంతం ప్రజలపట్ల, వారు చేసిన, చేస్తున్న ఉద్యమాల పట్ల గౌరవాన్ని తెలియజేస్తున్నాయి. ఇలా ఒక సంకలనం వస్తుందని, అందులో తన కథ ఒకటి ఉంటుందని కథా రచయితలు అనుకుని ఉండరు. అందువల్ల ఈ కథలు మొదటి తరం తెలుగు రచయితల మమేకత, సామాజిక ఆవశ్యకత నుండి వెలువడిన జీవధార, ఆర్థ్రత, మమేకతలు కలగవలసిన కథలుగా భావించాలి.
- జయధీర్తిరుమలరావు
