-
-
తెలంగాణ చరిత్ర - రివైజ్డ్
Telangana Charitra Revised
Author: K. Srinivas Chowhan
Publisher: Balu Publications
Pages: 200Language: Telugu
ఆంధ్ర పాలనలో కొమురం భీమ్ చరిత్ర, చాకలి ఐలమ్మ పోరాటం, మన కవులు, పోరాట యోధుల గురించి ఏ పాఠ్యంశాలలో పేర్కొనలేదు. మన చరిత్ర మనకు తెలియనీయకుండా వాళ్ళ చరిత్రను చదివించారు. మన భాషను సమాధిచేసి పత్రికలలో, పుస్తకాలలో వాళ్ళ భాషను ఉపయోగించారు. ఈ రోజు మనం మన చరిత్రను త్రవ్వి ప్రపంచానికి చూపించాలి. మన భాషను ఉపయోగించి సమాజాన్ని మెప్పించాలి. వేల మంది విద్యార్ధుల బలిదానాల త్యాగాల వల్ల ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి. మన సంస్కృతి, మన చరిత్ర, భాష, యాస చాలా గొప్పవి. సాయుధ పోరాట సమయంలో తెలంగాణ ప్రజల ఐక్యతను చూసి ప్రపంచం గర్వపడింది. కాని ఈరోజు వరకు మనం పరాయి చరిత్ర చదివి మనది అని భ్రమ పడ్డాం. వాళ్ళ చరిత్రను మన చరిత్రగా చదివించారు. ఇక ఆ రోజులు పోయాయి.
మన పాఠ్యాంశాలలో మన వీరుల చరిత్రలు, సంస్కృతి, పండుగలు, న్యాయపోరాటాల గురించి రాబోతున్నాయి. నిజాయితీతో నిర్భయంగా మన చరిత్రను వచ్చే తరాలకు అందించేటట్లు మనందరం అడుగు ముందుకు వెయ్యాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాన్ని నా వంతు బాధ్యతగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. మీ బాధ్యతగా దీనిని ఆదరించి ఉద్యోగాలు సాధించి తెలంగాణ నవ నిర్మాణానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాను.....
- శ్రీనివాస్ చౌహాన్

- ₹162
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹162
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60