-
-
తెగింపు - నవల
Tegimpu Navala
Author: Srujan
Publisher: Sufi Prachuranalu
Pages: 60Language: Telugu
మనిషి జీవితం, హత్య, మరణం, ప్రేమ గురించి ఒక ధ్యానం.
నేర ప్రపంచం చుట్టూ అల్లుకున్న ఒక వాస్తవ సంఘటన 'తెగింపు' కథా వస్తువు. సాధారణంగా అండర్వరల్డ్ గురించిన కథనాల్లో హింస, క్రౌర్యం విజృంభిస్తాయి. కానీ ఇక్కడ పశ్చాత్తాపం, జాలి, మనిషిలోని ఆంతర్యాన్ని తరిచి చెప్పే తీరు గుండెల్ని తాకుతుంది.
ఇందులోని సంఘటనలు ఏదో థ్రిల్ కోసం కావు. ఆయా పాత్రల సంఘర్షణ, విధ్వంసాలకు అద్దం పట్టినట్టు ఉంటాయి. నేరస్తుడిలో అంతర్గతంగా నెలకొన్న ప్రేమ, నమ్మకం, మోసం, ద్రోహం వీటన్నింటినీ అత్యంత మానవీయంగా అవిష్కరించి సరికొత్త కోణంలో చూపిన 'తెగింపు' ఇతర నేర ప్రపంచాల మాఫియా రచనలకన్నా విభిన్నంగా ఆకట్టుకుంటుంది.
అగ్ని శ్రీధర్గారికున్న అనుభవం, విపుల సాహిత్య పఠనం మాత్రమే కాదు, వారికున్న అపరిమిత జీవనోత్సాహం, ప్రజాపరమైన ఆలోచనలనుండి వచ్చిన రియలిస్టిక్ నెరేషన్ 'తెగింపు'ని ఒక అందమైన, అద్భుతమైన కథనంలా మార్చడంలో సఫలీకృతమైంది.
- బంజగెరె జయప్రకాష్
