-
-
తీపి గుర్తులు
Teepi Gurtulu
Author: Sankara Narayana
Publisher: Vanguri Foundation of America
Pages: 200Language: Telugu
'ఎందరో మహానుభావులు ... ఎందరికని వందనాలు ?' అన్నారు మహాకవి ఆరుద్ర. నా పరిస్థితీ అదే. అయినా నాకు చేయూత నిచ్చిన కొందరు మహానుభావులకైనా అక్షరాలా పాదాభివందనమో, పద్య పాదాభివందనమో, గద్య నైవేద్యమో చేయాలనుకున్నాను. అందుకు ఆత్మకథ రాయడం ఒక మార్గం. అయితే ఆత్మకథ అనగానే అందరికీ తెలిసిన వాళ్లు మాత్రమే రాసేది అనిపిస్తుంది. నేను అందరికీ తెలిసిన వాణ్ని కాదు గానీ అందరికీ తెలిసిన వాళ్లకు తెలిసిన వాణ్ని. అందుకే నా అనుభవాలను, అనుభూతులను రాస్తున్నాను. ఎటొచ్చీ ఆత్మకథల్లో (సొంత డబ్బా / పరడబ్బా) 'కథలు' ఉంటాయని ఈరోజుల్లో అనుమానిస్తుంటారు. అందువల్ల వాటి జోలికి పోలేను. నాది అనుభూతుల కలబోత మాత్రమే!
ఆత్మకథ రాయాలంటే నిబద్థత ఉండాలి. అది కష్టమైంది. హాస్యమంటే నాకు 'పంచ్' ప్రాణాలు. ఇది అందరికీ తెలుసు. కానీ సత్యం ఆరో ప్రాణం. నాకు తెలిసిన నిజాలన్నీ 'బీరు' పోకుండా (బ్రాంద్రీ, విస్కీలు కూడా పోకుండా) ఏకరువు పెట్టే నిజాయితీ నాకు లేదు. అయితే అబద్ధాలు రాసే ధైర్య సాహసాలూ నాకు లేవు. మరల ఇదేల 'ఆత్మకథ' అన్నచో నాదైన 'అనుభూతి' నాది గాన! అందువల్ల నా జీవితంలో నాకు ఇష్టమైన, జనం చదవడానికి ఇష్టపడే కొన్ని ఉదంతాలను, హృదంతాలను గుదిగుచ్చి ఈ పుస్తకం అందిస్తున్నాను. దీనికి 'తీపి గుర్తులు' అని పేరు పెట్టుకున్నాను.
- శంకరనారాయణ
Rent option please