-
-
టీ బ్రేక్ కథలు
Tea Break Kathalu
Author: Dr. Mantena Suryanarayana Raju
Publisher: Dr. Mantena Suryanarayana Raju
Pages: 136Language: Telugu
పుస్తకం పేరు ‘టీ బ్రేక్’. ఇది హాస్యానికి రికార్డు బ్రేక్. వీరు ప్రముఖ హాస్యరచయిత మునిమాణిక్యం నరసింహారావు గారి శిష్యుడు. అందుకే బహుశా రాజుగారికి హాస్యం పట్టు బాగా చిక్కినట్లైంది. అసలు విషయంలోకి వస్తే ఒక జులాయి గురించి ఇంకో జులాయికేగా బాగా తెలిసేది. రాజుగారు జులాయిల్ని అడ్డం పెట్టుకుని తెలుగు భాషకు కూడా పెద్ద సేవ చేసారు. ఉద్యోగం చేస్తూ అటు ‘పే...రడీ’ అయిందేమో చూసుకుంటూనే ఇటు హృద్యోగం కోసం పేరడీ చేశారు. తెలుగునుడి కారానికి, సామెతలకు అడుగడుగునా పేరడీ గుడి కట్టారు. ఈయన చేతుల్లో అప్పుచేసి పప్పుకూడు ‘తప్పు చేసి చిప్పకూడు’ అయింది. అక్కమొగుడు ‘కుక్క మొగుడు’ అయ్యాడు. లావొక్కింతయులేదు ‘లవ్వొక్కింతయులేదు’, ఇంద్రజాలం ‘చంద్రజాలం’ అయ్యింది.
కృషీతో నాస్తిదుర్భిక్షం ‘ఖుషీతో ఆస్తి నాశనమ్’ అయ్యింది. ఇవన్నీ కథల పేర్లు. కథల లోపలికి కళ్ళు పోతే (చూడకపోతే కళ్ళు పోతాయ్) అన్నట్టు ఉన్నాయి కథలు. ‘ఎవరు తక్కువ తిన్నారు’ అని జాతీయం చేసిన భాషా ఇందులో ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘హాస్య సరస్వతి’ ఆయన దగ్గర వాలిపోయింది.
- హాస్య బ్రహ్మా శంకరనారాయణ
