-
-
తత్వగీతం
Tatva Geetam
Author: Deevi Subbarao
Pages: 167Language: Telugu
17వ శతాబ్దానికి చెందిన పోతులూరి వీరబ్రహ్మం, ముడుమాల సిద్దయ్య, యాగంటి లక్ష్మప్ప తత్వగీతాల సంకలనమే ఈ గ్రంథం.
ఉపనిషత్తులసారాన్ని తేలిక భాషలో, ప్రజలకు అర్థమయ్యేరీతిలో చెప్పిన వీరి తత్త్వగీతాలు తెలుగువారి గొప్ప సాహిత్యసంపదగా లెక్కింపతగినవి. భగవంతుని యెడల ప్రేమ, మనుషుల మధ్య సుహృద్భావం ఈ తత్త్వగీతాలు ప్రభోదిస్తవి. ఇవి చదువుకోవటానికీ బాగుంటవి, పాడుకోవటానికీ బాగుంటవి.
* * *
ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము
మన బ్రహ్మంగారు చెప్పినది పెద్దమంత్రము
రెక్క ముక్కు లేని పక్షి రేయింబవలు తపసు జేసి
ఒక్క చెరువు చేపలన్ని ఒకటె మ్రింగెరా
ఇంటివెనుక తుట్టె పురుగు ఇంటిలో అందరిని మ్రింగి
చూడవచ్చిన వారినెల్ల చూచి మ్రింగెరా
కాళ్ళు చేతులు లేనివాడు కడవముంత చేతపట్టి
నిండు బావి నీటినంత ఒకడె చేదెరా
ఏటి మీద స్వాతి కొంగ వేటలాడుచు రాగా
చాటునున్న మీనుపిల్లి అట్టె మ్రింగెరా
చెప్పినాడు వీరబ్రహ్మము చోద్యముగ ఆత్మతత్వము
గొప్పవారు దీని భావము విప్పిచెప్పితే చాలు
ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము
మన బ్రహ్మంగారు చెప్పినది పెద్దమంత్రము
