-
-
తస్మాత్ జాగ్రత్త!
Tasmat Jagratta
Author: Lakshmana Rekha N. Gopalakrishna
Pages: 36Language: Telugu
మనం అనుకుంటున్న ఎయిడ్స్, అవినీతి మాత్రమే కాదు. కాలుష్యం అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైంది.
ప్రకృతి సిద్ధమైన గాలి, నీరు, నేల మనకు వరప్రసాదాలు. వాటిని కాలుష్యం చేయడం వల్లనే మనం నష్టపోతున్నాం. పురుగు మందులు, రసాయనాలు, యంత్రాలు వాడి వ్యవసాయం చేయడం వల్లనూ, వ్యర్థ పదార్థాలను విచ్చలవిడిగా పడేయడం వల్లనూ, ప్లాస్టిక్ వాడడం వల్లనూ, నగరంలోని చెట్లునూ, అడవులనూ నరికి వాతావరణానికి హాని కల్గించడం వల్లనూ, పరిశ్రమలలోని వ్యర్థాలను నీళ్ళల్లోకి వదలడం వల్లనూ, అనేక విధాలుగా మనం కాలుష్యానికి కారకులమవుతున్నాము.
దీనివల్ల గ్లోబల్ వార్మింగ్, మంచు కొండలు కరిగిపోవడం అనేక అనర్ధాలు వాటిల్లుతున్నాయి. వీటికి అన్నింటికీ తరుణోపాయాలు వున్నాయనీ, వృక్షాలను, గోవులను పోషిస్తే కాలుష్య వివారణయి, మనం ఆరోగ్యంగా ఉంటామని, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని, ఆరోగ్యాన్నీ పంచగలుగుతామనీ, ఈ పుస్తకంలో విపులంగా, సులువుగా అర్థమయ్యేలా వ్రాయడం జరిగింది.
పర్యావరణ పరిరక్షణ భూగోళం మీద నివసించే మన అందరికీ అవసరమని, అది ప్రతి ఒక్కరి బాధ్యతనీ, దానిని పాటించడం మన విధి, కర్తవ్యమని చాటి చెప్పే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివి, పాటించాలని కోరుతున్నాను.
- సాహిత్య శ్రీ ఎన్. గోపాలకృష్ణ

- ₹108
- ₹60
- ₹270
- ₹60
- ₹60
- ₹60